ఆస్తమా సమస్య చల్లటి గాలి తగిలినా, దుమ్ము ధూళిలో తిరిగినా లేదంటే చల్లటి పదార్థాలు తిన్నా వెంటనే వచ్చేస్తుంది. ఆస్త్మా సమస్య వున్నవారు వర్షాకాలం, శీతాకాలంలో మరింత ఎక్కువ ఇబ్బందికి గురవుతారు. అటువంటివారు ఆహారం విషయంలో తగినంత శ్రద్ద తీసుకోవాలి. అలా తీసుకుటే సమస్య తీవ్రతను కొంత తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
1. ఉల్లిపాయలు- వీటిలో యాంటీ ఇన్‌ప్లమేటరీ, యాంటీ ఆస్త్మాటిక్ ప్రభావాలున్నాయి. ఉల్లి తినడం వల్ల బ్రోంకియల్ అబ్‌స్ట్ర్క్షన్ తగ్గుతుంది.
2. నారింజ- కమలా, నారింజ, నిమ్మలలో ఉండే విటమిన్ సి ఉబ్బస లక్షణాలు తగ్గిస్తుందని వైద్యులు చెపుతున్నారు. కాబట్టి వీటిని తీసుకుంటే సమస్య తగ్గుతుంది.
3. యాపిల్- వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ ఆస్తమాతో ఇబ్బంది పడేవారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. యాపిల్ పైన తొక్క ముదుర రంగులో లైకోఫిన్ ఎక్కువగా ఉన్నందున యాంటిఆక్సిడెంట్‌గా ఆస్త్మా రోగులకు మేలు చేస్తుంది.
4. పాలకూర- ఇందులో మెగ్నీషయం వుంటుంది. ఆస్త్మా లక్షణాలను తగ్గించడంలో ఇది బాగా సహకరిస్తుంది. ఆస్తమా వున్నవారికి రక్తంలోనూ, టిష్యూలలోను మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలము మెగ్నీషియం స్థాయిలు పెంచుకోవడము వల్ల ఆస్త్మా సమస్య తగ్గుతుంది.