Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శరీరానికి కొలెస్ట్రాల్ అవసరం ఎంత?

Advertiesment
cholesterol
, సోమవారం, 19 సెప్టెంబరు 2022 (17:49 IST)
కొలెస్ట్రాల్ జీవితానికి అవసరం. అయితే రక్తంలో అధిక స్థాయిలో ఉన్నప్పుడు ఇది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్... కొవ్వు, కాల్షియం వంటి ఇతర పదార్ధాలతో పాటు, ధమనుల గోడలపై ఫలకాలలో పేరుకుపోతుంది. కాలక్రమేణా ఇది రక్త నాళాలకు ఇబ్బందిగా మారుతుంది. దీని ఫలితంగా స్ట్రోక్, గుండెపోటుతో సహా పలు అనారోగ్యాలకు దారితీస్తుంది. కొవ్వు, ప్రొటీన్‌లతో కూడిన పదార్థాలు అయిన లిపోప్రొటీన్‌ల ద్వారా కొలెస్ట్రాల్ శరీరంలో చేరుతుంది.

 
చెడు కొలెస్ట్రాల్... దీనినే LDL అని అంటారు. ఈ కొలెస్ట్రాల్‌ను కాలేయం నుండి కణాలకు తీసుకువెళుతుంది. ఇక్కడ ఇది అనేక ప్రక్రియలలో ఉపయోగించబడుతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ రక్తప్రవాహంలో అధిక స్థాయికి చేరితే హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

 
మంచి కొలెస్ట్రాల్... దీనినే HDL అంటారు. ఈ కొలెస్ట్రాల్‌ తిరిగి కాలేయానికి చేరుతుంది. అక్కడికి చేరుకున్న తర్వాత కొలెస్ట్రాల్ శరీరం నుండి తొలగించబడుతుంది.  తద్వారా హృదయనాళ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధుమేహం అడ్డుకునేందుకు నిమ్మకాయ చేసే మేలు ఏమిటి?