గర్భీణీలు వెల్లుల్లి రసాన్ని తీసుకుంటే?

వెల్లుల్లిలో గంధక రసాయనాలు పెద్దమెుత్తంలో ఉంటాయి. వెల్లుల్లిని వేయించి తీసుకోవడం కంటే ఉడికించి తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. పురుగు కాటుకు వెల్లుల్లి దివ్యౌషధంగా, విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. వెల్లుల్లి రసంలో నిమ్మరసాన్ని కలిపి చర్మ సమస్యలున్న

గురువారం, 7 జూన్ 2018 (10:25 IST)
వెల్లుల్లిలో గంధక రసాయనాలు పెద్దమెుత్తంలో ఉంటాయి. వెల్లుల్లిని వేయించి తీసుకోవడం కంటే ఉడికించి తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. పురుగు కాటుకు వెల్లుల్లి దివ్యౌషధంగా, విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. వెల్లుల్లి రసంలో నిమ్మరసాన్ని కలిపి చర్మ సమస్యలున్న ప్రాంతాలపై రాస్తే ఉపశమనం పొందవచ్చును. దీని వాసన పడనివారు వెల్లుల్లితో టమోటా, ఉల్లిపాయతో సూప్‌లా తయారుచేసి తీసుకోవచ్చును.
 
వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. జ్వరాల నుండి త్వరగా కోలుకోవడానికి వెల్లుల్లిరసాన్ని తేనెలో కలిపి తీసుకుంటే మంచిది. దీనిలో యాంటీ బయాటిక్‌గా, యాంటీ వైరస్‌గా పనిచేయడానికి ఈ గంధకమే కారణం. ఇది జీర్ణ వ్యవస్థను శుద్ధిచేస్తుంది. ఆస్తమాను, జలుబును, దగ్గును నివారిస్తుంది. 
 
దురదకు, పగుళ్ళకు, చర్మ సంబంధిత వ్యాధులను నివారిండానికి వెల్లుల్లి దివ్యమైన ఔషధం. నోటిపూతను తగ్గిస్తుంది. రక్తంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. దీర్ఘకాలిక జ్వరాలకు త్వరితంగా ఉపశమనం కలిగిస్తుంది. గర్భిణుల ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుతుంది. బాలింతలకు పాలు బాగా పడేలా చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చినుకులు పడుతున్న వేళ.. అల్లం టీ తాగితే?