ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ రకాల బట్టల సోపులు లభిస్తున్నాయి. వీటితో పాటుగా డిటర్జెంట్ పౌడర్‌లు ఎటూ ఉన్నాయి. అయితే వీటి ధరలు రోజు రోజుకీ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో వీటి ధర భారం తగ్గించుకోవడానికి ఇలా చేస్తే ఫలితముంటుంది అని చాలా మంది చెప్తుంటారు.
బట్టలను వేడినీటిలో వేసి ఉతికితే మురికి ఇట్టే వదులుతుందట. సాధారణంగా బట్టలు బాగా మురికిపట్టినప్పుడు వాటిని వేడినీటిలో వేసి ఉతుకుతారు. వేడినీటికి "తలతన్యత" తగ్గించే గుణం ఉండడం వల్ల నీటికి చొచ్చుకుపోయే శక్తి పెరుగుతుంది. ఫలితంగా వేడినీరు సులభంగా బట్టల పోగులలోకి వెళ్లి మురికిని బయటకు నెడుతుంది.
బట్టలను నీటిలో ఉడికించి, బయటకు తీసి వాటిని బండరాయి మీద బాదగానే మురికి సులభంగా బట్టలను వదిలి బయటకు పోతుంది. సబ్బులు, డిటర్జెంట్‌లు వాడకుండానే మురికి పోగొట్టే విధానము వేడినీటిలో బట్టలను ఉడకబెట్టి ఉతకడమేనట..!