సాధారణంగా వీకెండ్ హాలిడేస్, వేసవి సెలవుల్లో హాలిడే ట్రిప్‌ని ఎంజాయ్ చేయాలని చాలామంది భావిస్తుంటారు. తీరా ట్రిప్‌కు బయలుదేరే సమయానికి ఎలాంటి వస్తువులు తీసుకెళ్లాలో అర్థంకాకా, తికమక పడుతుంటారు. ఇలాంటి వారు ముందుగా కాస్తంత జాగ్రత్త తీసుకుంటే హాలిడే ట్రిప్ ఎంతో ఎంజాయ్ చేయవచ్చు. అసలు హాలిడే ట్రిప్‌లకు వెళ్లేవారు ఎలాంటి వస్తువులు, దుస్తులు పెట్టుకోవాలో పరిశీలిద్ధాం.
డే వేర్, నైట్ వేర్‌కు కావాల్సిన దుస్తులను పెట్టుకోండి. షూస్, సన్‌గ్లాసెస్, హ్యాట్, హ్యాండ్స్ ఫ్రీ పర్స్, కొంత నగదు, కార్డ్స్, ఇతర వస్తువులను వెంట తీసుకెళ్లాలి.
తలనొప్పి, జలుబు, అజీర్తి, వాంతులు, విరేచనాలు... వంటి సమస్యలకు తగిన మందులను ఉంచుకోవడం ఉత్తమం. చిన్న చిన్న గాయాలైతే కట్టుకోవడానికి బ్యాండేజ్, బెటాడిన్ వంటి వాటిని మరువద్దు. ఒకవేళ మీరు వెళ్లేది రిమోట్ ఏరియా అయితే మస్కిటో రిపెల్లెంట్ పెట్టుకోవడం ఉత్తమం.
డియోడరెంట్‌ను కూడా బ్యాగ్‌లో ఉంచుకోవడం మంచిది. మిమ్మల్ని ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంచడమేకాకుండా కొన్నిసార్లు వెపన్‌గా కూడా పనిచేస్తుంది. మీ ట్రావెల్ ట్రిప్‌ని పదిలం చేసుకోవాలంటే ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధించండి. అందుకోసం కెమెరాను తీసుకెళ్లడం మరచిపోవద్దు.
సెల్‌ఫోన్, కెమెరాలు వెంట తీసుకెళ్లగానే సరిపోదు. అడాప్టర్, చార్జర్ వంటి డివైజ్‌లు తీసుకెళ్లడం కూడా అవసరమే. ట్రావెలింగ్‌లో చార్జింగ్ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. కాబట్టి వాటిని మరువద్దు. మీరు వెళ్లే చోటు, వెళ్లిన సమయానికి ఫుడ్ దొరకకపోవచ్చు. అలాంటప్పుడు మీ బ్యాగ్‌లోని స్నాక్స్ ఆకలిని తీరుస్తాయి. కాబట్టి ఆల్మండ్స్, యాపిల్స్, ఇతర స్నాక్స్‌ను బ్యాగ్‌లో మర్చిపోకుండా పెట్టుకోండి.