Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రక్తపోటును తగ్గించే మందారం టీ....

మందార మొక్క అనేది ఉష్ణమండల మరియు వెచ్చని ప్రాంతాల్లో పెరిగే అందమైన పుష్పించే మొక్క. ఒక ప్రత్యేక అందం కలిగిన ఈ పుష్పాలు అనేక రకాల జాతులను కలిగి ఉన్నాయి. ఇది దక్షిణ కొరియా, మలేషియా మరియు హైతీ రిపబ్లిక్ యొక్క జాతీయ పుష్పంగా ఉన్నది. దీనిని దేవుని యొక్క

రక్తపోటును తగ్గించే మందారం టీ....
, శనివారం, 4 ఫిబ్రవరి 2017 (18:55 IST)
మందార మొక్క అనేది ఉష్ణమండల మరియు వెచ్చని ప్రాంతాల్లో పెరిగే అందమైన పుష్పించే మొక్క. ఒక ప్రత్యేక అందం కలిగిన ఈ పుష్పాలు అనేక రకాల జాతులను కలిగి ఉన్నాయి. ఇది దక్షిణ కొరియా, మలేషియా మరియు హైతీ రిపబ్లిక్ యొక్క జాతీయ పుష్పంగా ఉన్నది. దీనిని దేవుని యొక్క అనేక ఆచారాలు మరియు సమర్పణలలో ఉపయోగిస్తారు. భారతదేశంలో ఒక పవిత్రమైన పుష్పంగా భావిస్తారు. దీనిని శతాబ్దాలుగా భారతీయ ప్రాచీన ఆయుర్వేద వైద్య వ్యవస్థలో అనేక రుగ్మతల చికిత్స కొరకు ఉపయోగిస్తున్నారు.
 
మందార ఆకులను మాములుగానే కాకుండా వైద్యపరంగా కూడా ఉపయోగిస్తారు. తోటలు మరియు పార్కులలో వివిధ రూపాలలో అలంకరణ కొరకు ఉపయోగిస్తారు. మందార ఆకులను వేర్వేరు ఉపయోగాల కోసం వివిధ రూపాలలో ప్రాసెస్ చేస్తారు. మెక్సికన్ వంటి వివిధ రకాల వంటకాల్లో ఎండిన మందార ఆకులను గార్నిష్ కొరకు ఉపయోగిస్తారు. వీటి పూలను ఉపయోగించి టీ ని తయారుచేస్తారు. దీనిని అనేక దేశాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు.
 
మందార ఆకులలో ఉన్న ఔషధ ఉపయోగాల గురించి వివిధ రకాల పరిశోధనలు ద్వారా శాస్త్రీయంగా నిరూపణ జరిగింది. 2008USDA అధ్యయనం ప్రకారం మందార టీ తీసుకొనుట వలన రక్తపోటును తగ్గిస్తుందని తెలిసింది. ఆయుర్వేదంలో ఎరుపు మరియు తెలుపు మందారాలలో అధిక ఔషధ విలువలు ఉన్నాయని భావిస్తారు. వీటిని వివిధ రూపాలలో ఉపయోగించటం వలన దగ్గు చికిత్సకు,జుట్టు క్షీణత మరియు జుట్టు గ్రే కలర్ లో ఉండుటకు సహాయపడుతుంది. మందారంలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన యాంటీ వృద్ధాప్య ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తారు. మానసిక స్థితి సరిగా ఉండటానికి మందార ఆకు టీ ని వినియోగిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరగాలా? గుప్పెడు వేరుశెనగలు తినండి..