చాలామంది పొట్టిగా ఉన్నామని బాధపడుతుంటారు. ఎత్తు పెరగాలి అనే ఆశతో రకరకాల ప్రకటనలు చూసి మోసపోతుంటారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టి ఎత్తు పెరగడానికి వ్యాయామ మార్గాలు సహకరిస్తాయి. ఎత్తు పెరగడమనేది మన జన్యువులపై మాత్రమే ఆధారపడి ఉంటుందని చాలా మంది నమ్ముతుంటారు. అధికంగా, 25 సంవత్సరాల వయస్సులో ఎత్తు పెరగడం ఆగిపోతుంది, కానీ ఈ దశలో కూడా ఎత్తును మరికొన్ని అంగుళాలు పెంచడానికి కొన్ని విషయాల ద్వారా సాధ్యమవుతుంది. ఎత్తు పెరుగడానికి సహాయ పడే కొన్ని వ్యాయామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
ఎత్తు పెరగటానికి తాడు ఎగరడం లేదా తాడుపై గెంతటం కూడా ఒక మంచి వ్యాయామం. తాడు ఎగరడం వలన రక్త ప్రవాహం పెరుగుతుంది, అంతేకాక శరీరంలో పొడవు పెరగడానికి అవసరమయ్యే ఎముకలపై ఒత్తిడిని కలిగిస్తుంది.
కాలి వేళ్ళ మీద నిలబడి చేతులు పైకి చూసే విధంగా శరీరాన్ని ఎత్తాలి. సాధ్యమైనంత వరకు శరీరాన్ని అధిక స్థాయి వరకు చాచాలి. కనీసం 40 సెకన్ల పాటు చేతులను అలానే ఉంచాలి. ఈ వ్యాయామం చేయడం వల్ల వెన్నెముక సాగి తక్కువ సమయంలో పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది.
వేలాడటం అనేది అందరికి తెలిసిందే. ఎత్తు పెరాగడానికి గల శక్తివంతమైన వ్యాయామాలలో ఇది ఒకటి. ఈ వ్యాయామం చేయడం వల్ల వెన్నుపూసలోని మృదులాస్థిలను సాగెలా చేసి, అవి పెరగేలా చేస్తుంది.