ఎముకలు శరీరానికి ఆధారం. ఎముకల అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవాలంటే క్యాల్షియం గల ఆహారాల్ని అధికంగా తీసుకోవాలి. శరీరంలో కాల్షియంతో పాటు విటమిన్- డి తగ్గిపోవటం, థైరాయిడ్ గ్రంథి క్రియలో అతిగా స్పందించడం, మధుమేహం బారిన పడినవారు, వయసుమీరిన వారికి ఎముకల్లో సమస్యలు ఏర్పడుతుంటాయి. అందుచేత ఎముకలు బలంగా ఉండాలంటే.. రోజూ ఉదయం, రాత్రి పావు టీ స్పూన్ దాల్చిన చెక్కను మెత్తని చూర్ణంగా చేసి పాలల్లో కలిపి తాగడం మంచిది ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
ఇంకా ఈ టిప్స్ పాటించండి...
* కప్పు వేడిపాలలో టీ స్పూన్ నువ్వుల పొడిని కలిపి రోజుకు మూడుసార్లు తాగుతుంటే ఎముకలు గట్టిపడతాయి.
* గ్లాసు పాలల్లో అల్లం రసం, తేనెలను ఒక టీ స్పూన్ చొప్పున కలిపి తాగాలి.
* కాల్షియం ఎక్కువగా ఉండే మునగ ఆకులతో కూరను, పువ్వులతో చట్నీ చేసుకుని తింటే ఎముకలు బలపడతాయి.
* మునగ కాయలతో పులుసు చేసుకుని తింటే ఎముకలకు బలం చేకూర్చిన వారవుతారు.
* ఎనిమిది బాదం గింజలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిపై పొరలు తీసి ఆవుపాలలో కలిపి నూరి గ్లాసు పాలలో తాగాలి.