వృద్ధులకు పోషకాహారం అవసరం.. నూనె పదార్థాలు, వేపుళ్లు తగ్గించాల్సిందే..
వృద్ధులకు పోషకాహారం ఇవ్వడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వయస్సు పైబడిన వారిని రోగాలు ఆవహిస్తాయి. అందుచేత అన్నంతో పాటు పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధ ద్రవ్యాలు ఇవ్వాలని
వృద్ధులకు పోషకాహారం ఇవ్వడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వయస్సు పైబడిన వారిని రోగాలు ఆవహిస్తాయి. అందుచేత అన్నంతో పాటు పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధ ద్రవ్యాలు ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అన్నంతో పాటు ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటేనే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి.
వృద్ధులకు విటమిన్-డి, కాల్షియం, విటమిన్-బి12, పీచు, పొటాషియం వంటి పోషకాల అవసరం ఎక్కువ. అందుకే చేపలు, ఆకుకూరలు వంటివి వారానికి రెండు సార్లు తీసుకోవాలి. ఎముకల బలానికి పాలు రెండు పూటలా తీసుకోవాలి. చేపలు, సముద్ర ఆహారం, తేలికైన మాంసం నుంచి విటమిన్-బి12 పొందవచ్చు. అయితే నూనె పదార్థాలు, వేపుళ్లు తగ్గించడం మంచిది. నెయ్యి, డాల్డాలు వాడకపోవడం శ్రేయస్కరం.