Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వంటింటి వస్తువులతో పలు అనారోగ్య సమస్యలకు చెక్

Advertiesment
Health
, శనివారం, 2 ఏప్రియల్ 2016 (09:55 IST)
కొన్నిరకాల అనారోగ్యాలను ఇంట్లోవుండే ఆహర పదార్థాలతోనే నయం చేసుకోవచ్చు. ఈ రకమైన గృహ వైద్యం గురించి తెలుసుకుంటే తరచూ ఎదుర్కొనే ఇబ్బందులను కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న మందులకి, చేస్తున్న చికిత్సలకి ప్రత్యామ్నాయంగా ఈ చిట్కాలెంతగానో ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెల్సుకుందాం.
 
డయేరియా సమస్య ఉన్నవారు యాపిల్‌ను తురిమి దాని రంగు మారిన తర్వాత నెమ్మదిగా తినాలి. డయేరియాకి ఎప్పటి నుంచో ఉన్న పరిష్కారం నేరేడుపండ్లు. నేరేడుపండ్ల జామ్‌ని ప్రతి 3 గంటలకోసారి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. 
  
అజీర్ణం వల్ల గ్యాస్ సమస్య మొదలవుతుంది. ఉపశమనానికి అల్లం లేదా సోపుగింజలు వాడిన టీ తాగాలి. మోషన్‌సిక్‌నేస్ సమస్య పోవాలంటే ఒక గ్లాసు మంచి నీటిలో అరస్పూన్ అల్లంపొడిని కలిపి తాగాలి. మోషన్‌ సిక్‌నెస్‌కి పిప్పర్మెంట్ ఆయిల్ కొన్ని చుక్కలను అరస్పూన్ పంచదారకి కలుపుకుని తినాలి. పిప్పరమెంట్ వాడిన టీ తాగవచ్చు. 
 
మామిడి, బొప్పాయి, ఫైనాపిల్, కివి పండ్లు, వీటిని తింటే ఫలితముంటుంది. పొట్టలో ఎంత ఇబ్బందిగా వున్నా కొన్ని పండ్లలోని ఎంజైముల వల్ల తగ్గిపోతుంది. వెక్కిళ్ళు సమస్య ఉన్నప్పుడు ఓ కప్పు నీళ్ళలో చెంచాడు మెంతులువేసి మరగ కాచిన నీటిని తాగితే తగ్గిపోతుంది. కాల్షియం అధికంగా ఉన్న పెంటాసిడ్ మాత్రలు రెండు మూడు తిన్నాకూడా వెంటనే వెక్కిళ్ళు పోతాయి. 
 
పెద్ద గ్లాసుడు మంచినీళ్ళును నెమ్మదిగా తాగినా ఫలితం తప్పనిసరిగా కనబడుతుంది. హైడ్రేషన్, జలుబుల కారణంగా ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంటుంది. ఎలర్జీవల్ల, గాయం వల్ల కూడా ముక్కు నుంచి రక్తం కారవచ్చు. ముక్కు నుంచి రక్త స్రావం అవుతున్నప్పుడు నిటారుగా, తల కొంచెం ముందుకు వుండేలా కూర్చోవాలి. తలను ముందువైపు వుండేలా వంచితే రక్తస్రావం కొంచెం వరకు తగ్గుతుంది. 
 
చిన్న చిన్న గాయాలకు ఐస్ గడ్డలను లేదా బాగా చల్లగా ఉన్న వేటినైనా గాయాలు, బెణుకులు, దెబ్బలు, నొప్పులకి గురైన శరీర భాగంపై కాసేపు ఉంచితే ఉపశమనం కలుగుతుంది. గోరువెచ్చని నీళ్ళుపోసిన గిన్నెలో తురిమిన ఉల్లిపాయ, బంగాళాదుంపల్ని వేసి నొప్పి పెడుతున్న చేతిని లేదా పాదాన్ని ఆ నీళ్ళలో కాసేపు ఉంచాలి. అలా ఉంచితే నొప్పి మటుమాయం. 

Share this Story:

Follow Webdunia telugu