Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆహారాన్ని బాగా నమిలి తినాలి... లేకుంటే...

* మీరు మీ ఆరోగ్యం గురించి స్వయంగా జాగ్రత్తలు పాటించాలి.

ఆహారాన్ని బాగా నమిలి తినాలి... లేకుంటే...
, గురువారం, 29 సెప్టెంబరు 2016 (16:47 IST)
* మీరు మీ ఆరోగ్యం గురించి స్వయంగా జాగ్రత్తలు పాటించాలి.
 
* మీరు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లుండేలా చూసుకోండి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. 
 
* ఆరోగ్యంగా ఉండేందుకు ద్రవ పదార్థాలను ఎక్కువగా సేవించండి. 
 
* రాత్రిపూట మీరు తీసుకునే ఆహారం చాలా తక్కువగా ఉండేలా చూసుకోండి.
 
*  మీరు తీసుకునే ఆహారాన్ని బాగా నమిలి తినండి.
 
* మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసే ముందు తప్పని సరిగా సలాడ్ తీసుకోండి. 
 
* ఒకేసారి ఎక్కువగాను లేదా మరీ తక్కువగాను ఆహారాన్ని భుజించకండి. సమపాళ్ళల్లోనున్న ఆహారాన్ని భుజించండి. 
 
* గోధుమ పిండిని జల్లెడ పట్టకుండా రొట్టెలు చేసుకుని మరీ తినండి. ఎందుకంటే ఇందులోనున్న పీచు పదార్థం శరీరానికి చాలా మంచిది. 
 
* కూరగాయలను ఒలచకుండా సాధారణంగా స్క్రబ్ చేయండి. 
 
* వీలైనంత మేరకు ఫాస్ట్ ఫుడ్‌ను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. 
 
* ఉప్పును చాలా తక్కువగా ఉపయోగించేందుకు ప్రయత్నించండి.
 
* వయసు పెరిగేకొద్దీ ఆహార నియమాలను పాటించండి. వీలైనంత తక్కువగా ఆహారాన్ని సేవించేందుకు ప్రయత్నించండి.
 
* మీరు తీసుకునే ఆహారంలో పసుపు, నారింజ, ఆకుపచ్చ రంగుల్లోనున్న కూరగాయలను తప్పక సేవించండి. 
 
* ప్రతి రోజు పండ్లను సేవించండి. కనీసం రోజుకు ఒక పండునైనా ఆహారంగా తీసుకోండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుప్పెడంత గుండె... ల‌బ్ డ‌బ్... హార్ట్ బీట్ ఎప్ప‌టిక‌పుడు గ‌మ‌నించండి...