చెరకు రసాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. మధుమేహం ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా చెరుకు రసాన్ని తాగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు.
చెరకురసంలోని లవణాలు నోటి దుర్వాసనను వదిలించి దంతాలు పుచ్చిపోకుండా కాపాడతాయి. కామెర్ల వ్యాధి తగ్గించటంలో చెరకురసం మహత్తరంగా పని చేస్తుంది. జ్వరాన పడ్డప్పుడు కోల్పోయిన ప్రొటీన్‌ను చెరకు రసం భర్తీ చేయటంలో తోడ్పడుతుంది. మూత్రసంబంధ సమస్యలను చెరకు రసం పరిష్కరిస్తుంది.
కేన్సర్‌తో పోరాడే శక్తినిస్తుంది. ముఖ్యంగా ప్రొస్టేట్, బ్రెస్ట్ కేన్సర్‌ల చికిత్సకు ఎంతో ఉపకరిస్తుంది. శరీర బరువును తగ్గిస్తుంది. గొంతు నొప్పి, ఫ్లూ, జలుబులను తగ్గిస్తుంది. చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడమే కాక, కణాలు నాశనం కాకుండా చూస్తాయి. దీంతోపాటు శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.
ఐరన్, మెగ్నిషియం, కాల్షియం, ఎలక్ట్రోలైట్స్ దీంట్లో అధికంగా ఉంటాయి. ఇవి డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడేస్తాయి. సాధారణ జలుబు, ఇతర ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో చెరుకు రసం బాగా పనిచేస్తుంది.
చెరుకు రసం శరీరంలోని ప్రోటీన్ లెవల్స్‌ను పెంచుతుంది. లివర్‌ను పటిష్టం చేస్తుంది. అనారోగ్యాల బారి నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది. తక్షణ శక్తినిచ్చే కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఐరన్, పొటాషియం వంటివి ఇందులో అధికంగా ఉన్నాయి. ఇంకా అలసట తొలగిపోతుంది.