మునగాకు, దోసకాయ రసాన్ని ప్రతిరోజూ తాగితే..?
మునగాకులో ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టి మాంద్యము, రేచీక
మునగాకులో ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టి మాంద్యము, రేచీకటి తొలగిపోతాయి. గర్భిణులకు, బాలింతలకు మునగాకు రసం అమృతంగా పనిచేస్తుంది. మునగాకుల రసాన్ని పాలలో కలసి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి.
గర్భిణులు, బాలింతలు మునగాకు తీసుకుంటే.. కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు. పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మునగాకు రసాన్ని దోసకాయ రసంతో కలిసి ప్రతిరోజూ సేవిస్తే గుండె, కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. మునగ రసం రక్తహీనతను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.