టీ. దీన్ని అనేక రకాలుగా చేసుకుని తాగుతుంటాము. బ్లాక్ టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీ... ఇలా పలు రకాల టీల్లో టీ పొడిలో పాలు పోసి మరిగించి తయారుచేసే టీని తాగితే పలు ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
పాలుతో చేసే టీలోని యాంటీఆక్సిడెంట్లు, పాలలో కాల్షియం, పొటాషియం కలిసి ఆరోగ్యకరమైన ఎముకలు, కండరాలకు మేలు చేస్తాయి.
గ్లాసు పాలుతో టీ చేసుకుని తాగుతుంటే పాలలోని పిండి పదార్థాలు, ఇతర కంటెంట్‌లు శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి.
పాలుతో చేసిన టీ తాగుతుంటే అందులో వుండే ముఖ్యమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
త్వరగా వయసు పైబడకుండా చేయడంలో పాలుతో చేసిన టీ ఉపయోగపడుతుంది.
మిల్క్ టీలో ట్రిప్టోఫాన్ వంటి పోషకాలు ఉండటం వల్ల యాంటిడిప్రెసెంట్ ప్రభావాలుండి, ఇది మానసిక స్థితి- జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
పాలలోని కొవ్వులు బరువు పెరగడానికి, టీలో ఉండే పాలీఫెనాల్స్- కెఫిన్ బరువు తగ్గడానికి సహాయపడతాయి.