కంటి సమస్యలు, కీళ్ళనొప్పులతో బాధపడుతున్నారా? ఐతే కొత్తిమీర తీసుకోండి!
కంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే రోజూవారీ డైట్‌లో కొత్తిమీరను తీసుకోవాలి. కొత్తమీరలో ఎక్కువగా యాంటీ యాక్సిడెంట్లను కలిగి వుండటం ద్వారా కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా ఆపుతుంది. కొత్తిమీరను సాధారణంగ
కంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే రోజూవారీ డైట్‌లో కొత్తిమీరను తీసుకోవాలి. కొత్తమీరలో ఎక్కువగా యాంటీ యాక్సిడెంట్లను కలిగి వుండటం ద్వారా కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా ఆపుతుంది.
కొత్తిమీరను సాధారణంగా, రుచి కోసం వైద్య సంబంధమైన ఔషధాల తయారీల్లో వాడే కొత్తిమీరలో కొవ్వును నియంత్రించే యాంటీ-ఆక్సిడెంట్స్‌ను కలిగివుంటాయి. కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? ఆహారంలో ఎక్కువగా కొత్తిమీర తీసుకోండి. దీనిలో ఎక్కువ యాంటీ-ఆక్సిడెంటట్స్ ఉండటం వలన కీళ్ళనొప్పులను తగ్గించటమే కాకుండా, రుచిని పెంచును.
ఇవి.. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది. ముఖంపైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. కొత్తిమీర మంచి భావాన్ని కలిగించటమే కాకుండా, మంచి అనుభవాన్ని కలుగజేస్తుంది. దీనిలో ఎసేన్షియాల్ ఆయిల్స్ ఉండటము వలన తలనొప్పి, మానసిక అలసటను తగ్గిస్తుంది.
విటమిన్స్, మినరల్స్ విషయంలో కొత్తమీర విటమిన్ సిని కలిగివుంటుంది. ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ ''కె'' కొత్తిమీరలో పుష్కలంగా ఉన్నాయి. జింక్, కాపర్, పొటాషియం వంటివి ఉంటాయి. శరీరంలో ఇన్సులిన్ తయారీని పెంచి, రక్తంలోని చక్కర స్థాయిలను కొత్తిమీర తగ్గిస్తుంది.