Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరటి పండుతో మంచి ఆరోగ్యం సొంతం.. ఎలా?

Advertiesment
banana
, మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (09:18 IST)
రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన పనిలేదని పెద్దలు అంటున్నారు. కానీ మండుతున్న యాపిల్ ధరలతో సామాన్యులకు అవి అందుబాటులో ఉండలేకపోతున్నాయి. అందుచేత అందరికి అందుబాటులో ఉన్న అరటి పండ్లను ఎంచుకుంటే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అరటిపండ్లలో పుష్కలంగా లభ్యమయ్యే బి6, సి విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటినుంచి లభించే పీచు పదార్థాల వల్ల మలబద్ధకం నుంచి విముక్తి పొందుతారు. జీర్ణక్రియ మెరుగై విరేచనం సాఫీగా అవుతుంది. అయితే రెండు అరటిపండ్లు తింటే 90 నిమిషాల పాటు వ్యాయామం చేయగల శక్తినినిస్తాయి. 
 
వీటిలో ఉండే పొటాషియం రక్తపోటును నివారిస్తుంది. ట్రిప్టాన్‌లనే ప్రొటీన్లు కొన్ని రసాయన చర్యల అనంతరం ఆనందాన్ని పెంచే సెరటోనిన్ హార్మోన్‌గా మారుతాయి. ఆకుపచ్చని అరటిపండ్ల కన్నా పసుపుపచ్చరకం పండ్లలో పోషకాలు ఎనిమిది రేట్లు ఎక్కువట. 
 
అరటిపండ్లు అధిక పిండిపదార్థాలకు మూలం. ఒక పండు ద్వారా సగటున 27 గ్రాముల కార్బొహైడ్రేట్‌లు లభ్యమవుతాయి. జీర్ణమయ్యే వేగం కూడా తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఒక అరటి పండుతో సరిపెట్టుకుంటే మంచిదని వారు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu