Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెన్నెముక నొప్పి తగ్గడానికి హలాసనం..ఎలా వేయాలంటే..?

వెన్నెముక నొప్పి తగ్గడానికి హలాసనం..ఎలా వేయాలంటే..?
, శుక్రవారం, 13 డిశెంబరు 2019 (21:01 IST)
చాలామంది వెన్నెముక నొప్పితో ఎక్కువగా బాధపడుతుంటారు. ముఖ్యంగా 30యేళ్ళు దాటిన వారయితే ఈ నొప్పిని అస్సలు తట్టుకోలేరు. వెనుకకు వంగాలంటేనే భయపడిపోతుంటారు. ఒక్క సెకండ్ వెన్నెముక నొప్పి అయినా ప్రాణం పోయినట్లుంటుంది. అయితే వెన్నెమక నొప్పి తగ్గానికి హలాసనం మంచిదంటున్నారు యోగా గురువులు. 
 
అసలు ఈ హలాసనము ఎలా వేయాలంటే..మొండెమును నిదానంగా క్రిందకు దించాలి. చేతులను కాళ్ళను నేలపై ఉంచాలి. కాళ్ళ వేళ్ళను నేలను తాకునట్లు చూడాలి. తొడ వెనుక కండరములను లాగడం వల్ల మోకాళ్ళ వద్ద శరీరంపై భాగాన్ని పైకి లేపాలి. చేతులను నడుముపై నుంచి వీపు భూమికి సమాంతరంగా ఉండేటట్లు చూడాలి. 
 
చేతులను భూమిపై కాళ్ళు ఉన్న దిశకు ఎదురుచూస్తున్నట్లు బొటన వ్రేళ్ళు ఒకదానిలో ఒకటి తాకుతున్నట్లు ఉంచి కాళ్ళను చేతులను బాగా చాచాలి. కాళ్ళను చేతులను ఎదురుదిశలో చాచటం వల్ల వెన్నెముక బాగా సాగదీయబడుతుందట. నేలపై కాళ్ళ వేళ్ళు ఆనడం మొదట్లో కష్టమనిపించినా సాధన చేయడం వల్ల సులభమవుతుందట. శరీరం ఒక ప్రక్క ఒరిగిపోకుండా చూసుకోవాలట. మోకాళ్ళను ముందుకు వంగిచే సర్వాంగసనము అవుతుందట. ఇలా చేయడం వల్ల హలాసనం వేయడం సులభమవుతుందట. ఆ స్థితిలో ఒకటి నుంచి రెండు నిమిషాలు మామూలుగా శ్వాస పీల్చి వదులుతూ ఉండాలట. 
 
ఇలా చేస్తే వెన్నెముక ఎక్కువ రక్తము పొందుట వల్ల నడుము నొప్పి పోతుందట. చేతులు చాచటం వల్ల భుజము, మోచేతులు, తుంటి, కీళ్ళ నొప్పులు వల్ల బాధపడేవారికి ఉపశమనం లభిస్తుందట. కడుపులో గాలి వల్ల వచ్చు కుట్టునొప్పి కూడా తొగిపోతుందట. జీర్ణ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుందంటున్నారు యోగా గురువులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కివీ పండు తింటే కాంతివంతంగా వుంటారు...