Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనారోగ్యాలను దూరం చేసే జామకాయ..

జామకాయలో పీచు, విటమిన్లు, ప్రోటీన్లు బాగా లభిస్తాయి. ఇవి అనారోగ్యాలకు గురికాకుండా కాపాడుతుంది. నారింజ పండ్లలో దొరికే దానికంటే అధిక విటమిన్ సి అత్యధికంగా ఈ పండులో దొరుకుతుంది. జామకాయను తీసుకోవడం ద్వారా

అనారోగ్యాలను దూరం చేసే జామకాయ..
, ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (12:25 IST)
జామకాయలో పీచు, విటమిన్లు, ప్రోటీన్లు బాగా లభిస్తాయి. ఇవి అనారోగ్యాలకు గురికాకుండా కాపాడుతుంది. నారింజ పండ్లలో దొరికే దానికంటే అధిక విటమిన్ సి అత్యధికంగా ఈ పండులో దొరుకుతుంది. జామకాయను తీసుకోవడం ద్వారా విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్లు, బీటా కెరొటిన్, ల్యూటిన్లు కాన్సర్ కారకలు, కణతలు వ్యాప్తి చెందకుండా కాపాడుతాయి జామకాయలో విటమిన్ ఎ అధిక మోతాదులో ఉండటం వల్ల దృష్టిలోపాలు దూరమవుతాయి. శరీరంలో సోడియం, పొటాషియం పరిమాణాన్ని సమపాళ్లలో ఉంచి రక్తపోటు అదుపులో ఉండేందుకు ఉపయోగపడుతుంది. 
 
జామకాయ జ్యూస్ కాలేయానికి మంచి టానిక్ లాంటిది. ఈ జ్యూస్‌ను తీసుకోవడం ద్వారా రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు రోజూ రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా షుగర్‌ను తగ్గించుకోవచ్చు. జామకాయతో బ్లడ్‌లోని గ్లూకోజ్ లెవల్స్‌ను చాలా ఎఫెక్టివ్‌గా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఇన్సులిన్ ఉత్పత్తి కానివ్వకుండా బ్లడ్ షుగర్ లెవల్స్‌ను జామకాయ తగ్గిస్తుంది.
 
ఇకపోతే.. జామకాయలను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. దంతాల నొప్పి, గొంతు నొప్పి, చిగుళ్ళ వ్యాధులను నివారించడంలో జామ ఆకులు గ్రేట్‌గా సహాయపడుతాయి. జామఆకులతో తయారుచేసిన టీని రెగ్యులర్‌గా తీసుకుంటుంటే ఇది జీర్ణక్రియకు అవసరం అయ్యే జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. అలాగే జామకాయను రోజూ రెండేసి తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సహచరిపై అనుమానంతో గునపంతో దాడి.. ప్రియుడూ హతం...స్టేషన్‌లో హంతకుడు