Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పల్లీలు ఎంత బలమైన ఆహారమో గాంధీగారే చెప్పారు.. మళ్లీ కొత్తగా చెప్పాలా?

మన తాత ముత్తాతలకు చదువులు పెద్దగా ఉండకపోవచ్చు గానీ ఏది తింటే ఒంటికి మంచిది, ఏది తినకూడదు, ఏ పనులు చేయకూడదు అనే ఇంగిత జ్ఞానం మనకంటే కాస్త ఎక్కువగానే ఉండేది. పోషకాహారం, సమతుల్య ఆహారం వంటి పెద్ద పెద్ద పదాలు, భావనలు వారికి తెలియకున్నా, ఏ సీజన్‌లో దొరికే

Advertiesment
పల్లీలు ఎంత బలమైన ఆహారమో గాంధీగారే చెప్పారు.. మళ్లీ కొత్తగా చెప్పాలా?
హైదరాబాద్ , శుక్రవారం, 31 మార్చి 2017 (07:28 IST)
మన తాత ముత్తాతలకు చదువులు పెద్దగా ఉండకపోవచ్చు గానీ ఏది తింటే ఒంటికి మంచిది, ఏది తినకూడదు, ఏ పనులు చేయకూడదు అనే ఇంగిత జ్ఞానం మనకంటే కాస్త ఎక్కువగానే ఉండేది. పోషకాహారం, సమతుల్య ఆహారం వంటి పెద్ద పెద్ద పదాలు, భావనలు వారికి తెలియకున్నా, ఏ సీజన్‌లో దొరికే పదార్ధాలను, పళ్లను, ఆహారాన్ని ఆ సీజన్‌లో తప్పక తినాలనే స్పృహ వారికి ఉండేది. పైగా ఆహారంలో కాయధాన్యాలు ఎంత ముఖ్యమైనవో వారికి ఎప్పటినుంచో తెలుసు. 
 
మన జాతిపిత గాంధీ గారికి కూడా ఈ జ్ఞానమే పారంపర్యంగా వచ్చిందేమో మరి.. జీవితాంతం ఆయన ఆహారం జోలికి పోకుండా పల్లీలు, మేకపాలు, పండ్లతో సరిపెట్టుకున్నారు. అలా 90 ఏళ్లపాటు ఆరోగ్యంగా గడిపారు. వేరుశనగ రోజూ తీసుకోవడం ద్వారా ఆయనకు జీవితంలో ఒక్కసారి కూడా గుండెపోటు రాలేదు. చివరి క్షణంలో విచక్షణ మరిచినవాడు బుల్లెట్ పేలిస్తే గుండె చెదిరి చనిపోయారు కాని అంతవరకు ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడే. చిన్నప్పుడు తనకు సంక్రమించిన మొండి వ్యాధిని డాక్టర్ సలహాతో పల్లీలు తినడం ద్వారా తగ్గించుకున్నారు.
 
ఇదే విషయాన్ని పల్లీల మహత్యాన్ని అమెరికన్ పరిశోధకులు మరోసారి గట్టిగా చెబుతున్నారు. పల్లీలు తింటే గుండెకు చాలా మంచిదని వారు కొత్తగా కనిపెట్టారు. పల్లీలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండెపోటు ముప్పు తగ్గుతుందని వారు ప్రయోగం చేసి మరీ కనుగొన్నారు. ఆరోగ్యవంతులు, ఊబకాయం ఉన్న 15 మందిలో కొంతమందికి వెన్సిల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు నియమబద్ధంగా రోజుకు 85 గ్రాముల వేరుశనగలను అందించారు. మరికొంతమందికి పల్లీలు లేకుండా పోషకాలు ఉన్న ఆహారం అందించారు. 
 
కొన్నిరోజుల తర్వాత  వీరి రక్త నమూనాలలో లైపిడ్, లైపిట్ ప్రొటీన్, ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్ధంగా పరిశించగా ఆశ్చర్యకరమైన ఫలితాలు కనుగొన్నారు. పల్లీలు తీసుకోనివారితో తీసుకున్న వారిని పోల్చి చూస్తే పల్లీలు తీసుకోని వారి రక్తనమూనాలో ట్రైగ్లిసరైడ్స్ 32 శాతం తగ్గినట్లు గ్రహించారు.  వేరుశనగ విత్తనాలు తీసుకుంటే 
ఈ సమస్య తగ్గుతుందని వారు బల్లగుద్ది మరీ చెప్పారు.
 
ఇప్పుడు చెప్పండి అమెరికా వారో ఏ ఇతర దేశాల వారో శంకులో పోస్తే తప్ప తీర్థం కాదా. కాయధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకోవడంలో పూర్వీకులు పోగు చేసిన సంచిత జ్ఞానం మాటేంటి? ఏదేమైనా రోజు వారీగా పల్లీలు తినడం మాత్రం మర్చిపోకండి. అది మన గుండెకు రక్షణ కవచం మరి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఖంపై మచ్చలు... నిమ్మరసంతో ఇలా తొలగించవచ్చు....