పల్లీలు తినండి.. ఆలోచనాశక్తిని పెంచుకోండి.. గుండె జబ్బులకు బై చెప్పండి..
పల్లీలు తినండి.. ఆలోచనాశక్తిని పెంచుకోండి.. గుండె జబ్బులకు బై చెప్పండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పల్లీలు గుప్పెడు తీసుకుంటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పల్లీలు ఎక్కువగా తింటే పైత్యమని పెద్దవ
పల్లీలు తినండి.. ఆలోచనాశక్తిని పెంచుకోండి.. గుండె జబ్బులకు బై చెప్పండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పల్లీలు గుప్పెడు తీసుకుంటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పల్లీలు ఎక్కువగా తింటే పైత్యమని పెద్దవాళ్లు అంటారు. అందుకే ఉడకబెట్టి, వేయించుకొని తింటారు. అయితే పల్లీలు బ్లడ్ షుగర్‌ని రెగ్యులేట్ చేస్తుంది. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్లో ఉంచుతుంది. పిత్తాశయ సమస్యలను దూరంగా చేస్తుంది.
ఒత్తిడిని కూడా తగ్గిస్తుందట. పల్లీలు తినడం వల్ల ఆలోచనాశక్తి పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ కారకాలను నిర్మూలిస్తుంది. భోజనం చేసే ముందు కొన్ని పల్లీలు తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుందని వారు చెప్తున్నారు. అలాగే గర్భం దాల్చిన మహిళలకు ఫోలిక్ యాసిడ్ ఉండే ట్యాబ్లెట్లను ఇస్తారు. దాంతోపాటు పల్లీలు తినడం వల్ల నాళీ సంబంధ లోపాలను దాదాపు 70 శాతం వరకు తగ్గించవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.