బఠాణీలు తినండి.. ఇమ్యూనిటి పెంచుకోండి... కొలెస్ట్రాల్ తగ్గించుకోండి..
బఠాణీలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే బఠాణీలు ఇమునిటీని పెంచుతాయి. సంతాన లేమికి బఠాణీలు బేష్‌గా పనిచేస్తాయి. ఇందులో ఫోలిక్ యాసిడ్ పుష్కల
బఠాణీలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే బఠాణీలు ఇమునిటీని పెంచుతాయి. సంతాన లేమికి బఠాణీలు బేష్‌గా పనిచేస్తాయి. ఇందులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇక కణాల్లోని డీఎన్ఏ తయారీకి ఫోలేట్లు అవసరం.
అందుకే ఫోలేట్లు సమృద్ధిగా ఉండే బఠాణీలను తీసుకోవడం ద్వారా గర్భం ధరించడం సులువవుతుంది. ఇక గర్భంగా ఉన్నప్పుడు బఠాణీలు తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డలో నాడీ సంబంధ సమస్యలు లేకుండా చేస్తాయి.
బఠాణీల్లో ఫైటోస్టెరాల్స్ ముఖ్యంగా బీటా సైటోస్టెరాల్ లభ్యమవుతుంది. ఈ రకమైన స్టెరాల్స్ శరీరంలో పేరుకున్న కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించేందుకు తోడ్పడతాయి. తాజా బఠాణీల్లో కె-విటమిన్ శాతమూ ఎక్కువే. ఎముక బరువు పెరగడానికి ఇది ఎంతో అవసరం.
ఆల్జీమర్స్, ఆర్థ్రైటిస్... వంటి వ్యాధుల్ని అరికట్టేందుకూ ఇది తోడ్పడుతుంది. ఇక బఠాణీల్లో యాంటీ యాక్సిడెంట్లు ఫేవనాయిడ్స్ జియాక్సాంథిన్, ల్యూటెన్, విటమిన్-ఎ... వంటి కెరొటినాయిడ్లూ పుష్కలంగా దొరుకుతాయి. అందుకే ఇవి కంటి ఆరోగ్యానికీ ఎంతో మంచివని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.