Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కీళ్ళ నొప్పులను నయం చేసే ఆకుకూరలు.. సూప్‌లలో చేర్చుకుంటే..?

ఆకుకూరలు తినండి.. అనారోగ్యాలకు చెక్ పెట్టండి. పచ్చని ఆకుకూరలు గుండెకు మేలు చేస్తాయి. నడుము చుట్టు కొలతను పెంచనివ్వవు. ముఖ్యంగా బచ్చలి కూరలో విటమిన్లు కె, ఎ, సి, బి2, బి6 ఉన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడ

Advertiesment
కీళ్ళ నొప్పులను నయం చేసే ఆకుకూరలు.. సూప్‌లలో చేర్చుకుంటే..?
, బుధవారం, 2 నవంబరు 2016 (10:44 IST)
ఆకుకూరలు తినండి.. అనారోగ్యాలకు చెక్ పెట్టండి. పచ్చని ఆకుకూరలు గుండెకు మేలు చేస్తాయి. నడుము చుట్టు కొలతను పెంచనివ్వవు. ముఖ్యంగా బచ్చలి కూరలో విటమిన్లు కె, ఎ, సి, బి2, బి6 ఉన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ హానికరమైన ప్రభావం నుంచి శరీరాన్ని కాపాడుతాయి. ఈ ఆకుల్ని బజ్జీలు, సూప్‌లలో వేయండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
మెంతికూరలో క్యాల్షియం, ఇనుము, ఫాస్పరస్‌తో పాటు ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది ఆకలిని పుట్టిస్తుంది. కీళ్ళ నొప్పులను నయం చేస్తుంది. ఒక గుప్పెడు మెంతి ఆకులను పరోటాలలో, చట్నీలలో వేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతాయి.
 
మెంతికూరలో అద్భుతమైన ఔషధ ఆహారం. ప్రతిరోజూ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉడకబెట్టిన మెంతికూర ఆకులు అజీర్ణాన్ని పోగొడతాయి. మందంగా ఉన్న కాలేయాన్ని చురుకుగా పనిచేయిస్తాయి. రక్తహీనతను నివారిస్తాయి. శ్వాసక్రియలోని అవరోధాలు సరిచేస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కీలకమవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండటమే కాదు... వ్యాధులకు ఔషధంగా కూడా...