పచ్చి అరటి పండు తింటే బరువు తగ్గుతారట..
రాత్రిపూట పచ్చి అరటి పండును తింటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటిపండు తింటే లావైపోతారనేది అపోహ మాత్రమేనని.. పచ్చి అరటితో బరువును తగ్గించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. అరటి పండులోని
రాత్రిపూట పచ్చి అరటి పండును తింటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటిపండు తింటే లావైపోతారనేది అపోహ మాత్రమేనని.. పచ్చి అరటితో బరువును తగ్గించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. అరటి పండులోని విటమిన్ బి-6, శరీరంలో పేరుకున్న కొవ్వుని కరిగించి, అధిక బరువును నియంత్రిస్తుంది. దీంతో పాటు ఇందులో ఉండే మినరల్స్ జీర్ణప్రక్రియను సులభతరం చేస్తుంది.
నీరసం, బద్ధకం వంటి లక్షణాల నుంచి బయటపడేస్తుంది. అలాగే బాదం పప్పు, విటమిన్ 'సి' జాతికి చెందిన తాజా పండ్లు, శెనగలు, గ్రీన్ టీ, డార్క్ చాక్లెట్ వంటివి కూడా శరీరంలోని అధిక బరువును నియంత్రించి ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండేందుకు సహకరిస్తాయి. వీటితో పాటు మాంసాహారం అలవాటు ఉన్నవారైతే సాల్మన్ చేపను తరచూ తినడం వల్ల శరీరంలో కొవ్వును దరిచేరనివ్వకుండా జాగ్రత్తపడవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.