Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్ర శాకము గోంగూర... అందులో ఏముందో తెలుసా?

గోంగూరను చాలామంది తినడానికి ఇష్టపడరు. గోంగూర తింటే చలవ చేస్తుంది అంటుంటారు. అయితే గోంగూర వల్ల ఎన్నో లాభాలున్నాయి. గోంగూరలో విటమిన్ ఎ, బి1, బి9, సి పుష్కలంగా ఉంది. పొటాషియమ్‌, కాల్షియమ్‌, ఫోస్పర్స్, సో

Advertiesment
ఆంధ్ర శాకము గోంగూర... అందులో ఏముందో తెలుసా?
, గురువారం, 5 జనవరి 2017 (15:15 IST)
గోంగూరను చాలామంది తినడానికి ఇష్టపడరు. గోంగూర తింటే చలవ చేస్తుంది అంటుంటారు. అయితే గోంగూర వల్ల ఎన్నో లాభాలున్నాయి. గోంగూరలో విటమిన్ ఎ, బి1, బి9, సి పుష్కలంగా ఉంది. పొటాషియమ్‌, కాల్షియమ్‌, ఫోస్పర్స్, సోడియం, ఐరన్ సమృద్థిగా ఉన్నాయి. దీనిలో ప్రోటీన్స్, కార్బోహైడ్రైట్స్ అధికంగా ఉండి క్రొవ్వు చాలా తక్కువగా ఉండును. ఆక్సలిన్‌ ఆసిడ్‌ ఉన్నందున కొంచెం వగరుగా ఉంటుంది. 
 
గోంగూరలోని విటమిన్‌ ఎ కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. రేచీకటిని కూడా తగ్గిస్తుంది. చాలా తక్కువ కొవ్వు, క్యాలరీస్‌ ఉండి, మినరల్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్ ఉన్నందున గోంగూర శరీర అధిక బరువు తగ్గించును. యాంటీ ఆక్సిండెంట్స్ సమపాళ్లలో ఉన్నందున చెడు కొలెస్ట్రాల్‌ని తొలగించి రక్తపోటుని సక్రమంగా ఉంచును.
 
ఒక కప్పు గోంగూర తాజా రసంలో మనిషికి ఒక రోజుకి కావాల్సిన విటమిన్‌ సి లో 53 శాతం లభించును. అందువల్ల గోంగూర చర్మ సంబంధమైన సమస్యలు పరిష్కరించును. ఎండిన గోంగూర ఆకులు పేస్ట్ చేసి గజ్జి, తామరపై రాసిన కొంతకాలానికి మంచి ఫలితం వస్తుంది. తాజా ఆకులు పేస్టు చేసి పేస్‌ప్యాక్‌‌లాగా వాడిన చర్మపు ముడతు తగ్గి గట్టిగా కాంతివంతం అవుతుంది.
 
గోంగూరని క్రమంగా వాడితే నిద్రలేమి, అధిక రక్తపోటు తగ్గును. ప్రతి రాత్రి నిద్రకు ముందు కప్పు గోంగూర రసం తాగితే మంచి నిద్రపడుతుంది. గోంగూర ఆకుల పేస్ట్ తలకు పట్టించి ఉదయం స్నానం చేస్తే వెంట్రుకలు ఊడడం తగ్గి బట్టతల రాకుండా కాపాడుతుంది. గోంగూరలోని కాల్షియమ్‌ ఎముకలు తగ్గిపడటంలో మంచి ఫలితం ఇస్తుంది. 
 
ముఖ్యంగా మూడు పదులు దాటినా మహిళలు గోంగూర ఒక వరం. ఐరన్‌, సోడియం, పొటాషియం అధిక పాళ్ళలో ఉన్నందున గోంగూర క్రమంగా ఇతర ఆహారంతో కలిపి తీసుకున్నచో, మహిళలకు రుతుక్రమ సమయంలో మరియు కాన్సు తరువాత తగ్గిన శక్తి వస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెల్లంలో హానికారక పదార్థం హైడ్రాన్.. విషం కంటే ప్రమాదమట!