నిమ్మకాయ మనం అన్ని విధాలుగా ఉపయోగిస్తుంటాం. అన్ని ప్రాంతాలలో విరివిగా దొరుకుతుంది. నిమ్మకాయ రసం నీటిలో లేదా మజ్జిగలో పిండుకుని తాగటం మనవారి అలవాటు. నిమ్మలోని విటమిన్ సి వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగై పలురకాల అంటురోగాల నుంచి మనల్ని రక్షిస్తుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ప్రతిరోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే అది కాలేయానికి టానిక్‌గా పనిచేస్తుంది. నిమ్మరసంలోని విటమిన్ సి వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగై, పలురకాల అంటురోగాల నుంచి మనల్ని రక్షిస్తుంది. గొంతునొప్పి, ఆస్తమా ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇచ్చే గుణం నిమ్మకు ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.