మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువుండాలి. పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే నీళ్లు కూడా అధికంగా తాగుతాం. దీని వల్ల శరీరంలోని విషపదార్థాలు శరీరం నుంచి బయటికి వెళ్లిపోతాయి. భోజనానికి, భోజనానికి మధ్యలో అధిక పీచు పదార్థాలను తీసుకుంటే కడుపు నిండుతుంది. వెంటనే ఆకలి వేయదు. దీని వల్ల జంక్ ఫుడ్‌ను నివారించినట్లవుతుంది
కాయకూరలు, ధాన్యాలు, నట్స్, సీడ్స్, బీన్స్, లెగూమ్స్, ఎండిన లేదా తాజా పండ్లలో పీచు పదార్థాలుంటాయి. ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్, చిక్కుడు వంటివాటిని తీసుకోవడం ద్వారా గుండెజబ్బులు తగ్గుతాయి. హృద్రోగ వ్యాధుల్ని నివారిస్తాయి. రక్తంలో షుగర్ లెవల్స్‌ను శుద్ధీకరిస్తాయి. గోధుమలు, జొన్నలు, పండ్లు తీసుకోవడం ద్వారా కడుపు త్వరలో నిండిపోతుంది. తద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.