అబ్బబ్బా.. అధిక కొలెస్ట్రాల్.. రాత్రి నానబెట్టిన మెంతుల నీటిని తెల్లారి తాగితే?
మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుంది. మెంతులు అధిక కొలెస్టరాల్, షుగర్ వ్యాధి, అధిక బరువు సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. మెంతుల్లో
మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుంది. మెంతులు అధిక కొలెస్టరాల్, షుగర్ వ్యాధి, అధిక బరువు సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. మెంతుల్లో కావలసినంత ఫైబర్ ఉంటుంది. మెంతి ఆకుల్లోనూ ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. మహిళలు మెంతులు తరచుగా తింటే నెలసరి క్రమంగా వస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవాలంటే.. ప్రతిరోజూ రెండు చెంచాల మెంతులు తీసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
బరువు తగ్గాలంటే.. రాత్రి మెంతుల్ని నానబెట్టి.. తెల్లవారు జామున ఆ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు పొడి వేసి ఉదయం, సాయంత్రం తాగితే జలుబు త్వరగా తగ్గుతుంది. పసుపును నీటిలో కలిపి ముద్ద చేసి లేదా లేత వేపాకు గుజ్టుతో కానీ కలిపి చర్మంపై రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. బెణికినప్పుడు నొప్పికి, గాయాలకు, కీళ్లవద్ద కొంచెం వాపు, నొప్పికి సున్నం, పసుపు కలిపి తేలికగా రుద్దితే మంచి ఉపశమనం కలుగుతుంది.
ఇకపోతే.. పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్పినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో మెండుగా వున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.