వేడినీటిలో స్నానం చేసిన తర్వాత ఆహారం తీసుకోవచ్చా?
వేడినీటిలో స్నానం చేసిన తర్వాత ఆహారం తీసుకోవడం.. ఆహారం తీసుకున్న తర్వాత స్నానం చేయకూడదు. మనం తీసుకునే ఆహారం జీర్ణం కావాలంటే.. ఉదర భాగంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉండాలి. అయితే వేడినీటిలో స్నానం చేశాక.. శరీ
వేడినీటిలో స్నానం చేసిన తర్వాత ఆహారం తీసుకోవడం.. ఆహారం తీసుకున్న తర్వాత స్నానం చేయకూడదు. మనం తీసుకునే ఆహారం జీర్ణం కావాలంటే.. ఉదర భాగంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉండాలి. అయితే వేడినీటిలో స్నానం చేశాక.. శరీరాన్ని చల్లబరిచేందుకు అధికరక్తం చర్మానికి చేరుతుంది. అలాగే ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేస్తే.. రక్త ప్రసరణ చేతులు కాళ్లు వంటి భాగాలకు చేరుతుంది. అందుచేత ఉదర భాగంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. తద్వారా తీసుకున్న ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది.
కాబట్టి స్నానం చేసిన అరగంట తర్వాత ఆహారం తీసుకోవాలి. అలాగే ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత స్నానం చేయాలి. ఆహారం తీసుకున్న వెంటనే పండ్లను తీసుకోకూడదు. ఇలా చేస్తే గ్యాస్‌తో పాటు అయోడిన్ శరీరంలో చేరుతుంది. అందుకే ఆహారం తీసుకున్న రెండు గంటలకు తర్వాతే పండ్లు తీసుకోవాలి. లేదా ఆహారం తీసుకోవడానికి గంట ముందు పండ్లు తీసుకోవచ్చు.
ఇదేవిధంగా ఆహారం తీసుకున్న వెంటనే టీ తాగడం చేయకూడదు. ఇలా చేస్తే అధిక స్థాయిలో ఆమ్లాలను శరీరంలో చేర్చినవారవుతాం. తద్వారా అజీర్తి తప్పదు. ఆహారం తీసుకున్న తర్వాత పొగతాగకూడదు. తద్వారా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. అలాగే ఆహారం తీసుకున్నాక బెల్టును వదులు చేయడం కూడదు. ఇలా చేస్తే.. తీసుకునే ఆహారం వేగంగా పేగులకు చేరుతుంది. తద్వారా జీర్ణ ప్రక్రియ సజావుగా సాగదు. అలాగే ఆహారం తీసుకున్న వెంటనే నిద్రించకూడదు. తద్వారా కడుపులో గ్యాస్, బ్యాక్టీరియా చేరుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు తప్పవు.