Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్ట్రెస్ (ఒత్తిడి)‌.. ఏం చేస్తుంది?

స్ట్రెస్ లేదా ఒత్తిడి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఇపుడు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్య. ఈ స్ట్రెస్ వల్ల అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా యువతలో లైంగిక వాంఛలు తగ్గిపోతున్నాయి

Advertiesment
Stress
, సోమవారం, 7 ఆగస్టు 2017 (11:26 IST)
స్ట్రెస్ లేదా ఒత్తిడి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఇపుడు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్య. ఈ స్ట్రెస్ వల్ల అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా యువతలో లైంగిక వాంఛలు తగ్గిపోతున్నాయి. అంగస్తంభన తగ్గిపోయి లైంగికపటుత్వాన్ని కోల్పోతున్నారు. వీటికి ఒత్తిడికి సంబంధమేంటని అనుకోవచ్చు. కానీ... ఈ ఒత్తిడీ యువత జీవితాల్లో వెలుగులు లేకుండా చేస్తోంది. 
 
ఆఫీసులో పని ఒత్తిడి ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో పరిశీలిస్తే... ఫోన్‌లో బ్యాటరీ చార్జింగ్‌ తగ్గుతూ.. క్రిటికల్‌ స్టేజ్‌కు అంటే ఏ 15 శాతానికో 10 శాతానికో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ (కాంతి)ని తగ్గించేస్తాం. లొకేషన్‌ ఎనేబుల్‌ చేసి ఉంటే దాన్ని ఆఫ్‌ చేసేస్తాం. అవసరాన్ని బట్టి.. వైఫై, మొబైల్‌ డేటాలనూ ఆపేస్తాం. ఫోన్‌కాల్స్‌ చేసుకునే ఆప్షన్‌ తప్ప మిగతా ఆప్షన్లన్నిటినీ డిజేబుల్‌ చేస్తుంటాం.  
 
అలాగే, మనిషి ఒత్తిడికి గురి కాగానే.. శరీరానికి అత్యంత ఆవశ్యకమైన రక్తసరఫరా, హృదయ స్పందనల వంటివాటిపైనే దృష్టి సారిస్తుంది. జీవక్రియల లెక్కలో శృంగారం లగ్జరీ. నిత్యావసరం కాదు. కాబట్టి.. కార్టిసాల్‌ను భారీగా పెంచేసి టెస్టోస్టీరాన్‌ స్థాయుల్ని తగ్గించి అంగస్తంభనను డి..జే..బు..ల్‌ చేసేస్తుంది! ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా యువత ‘నిర్వీర్య’మవుతోంది. గతంతో పోలిస్తే.. యువకుల్లో వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో పాటు పునరుత్పాదక శక్తి సన్నగిల్లుతోందని తాజా పరిశోధనల్లో తేలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శృంగారాన్ని ఎంజాయ్ చేయడం చాలామందికి తెలియదట...