Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆహారానికి ముందు సూప్ తీసుకుంటే బరువు తగ్గొచ్చా..? లెమన్ టీలో..?

Advertiesment
Eating soup will help cut calories at meal
, బుధవారం, 20 ఏప్రియల్ 2016 (17:31 IST)
సన్నబడాలనుకుంటున్నారా? ఆహారానికి ముందు సూప్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే అల్పాహారంలో తృణధాన్యాలు, తేనె, బాదం పెరుగు లాంటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అందులో కెలోరీలు తక్కువగా ఉండాలంటే ఉడికించినవి ఎంచుకోవాలి. ఇంకా భోజనానికి ముందు సూప్ తీసుకోవడం వల్ల ఇరవై శాతం కెలొరీలు తగ్గుతాయని ఇప్పటికే అధ్యయనాలు చెప్తున్నాయి. 
 
కాబట్టి సూప్ తాగడం రోజువారీ అలవాటుగా మార్చుకోవాలి. అలాగే కొవ్వు తగ్గడానికి ప్రొటీన్లున్న ఆహారం కూడా ఎంతో మేలు చేస్తుంది.. కాబట్టి వాటి మోతాదును పెంచి, పిండి పదార్థాలను తగ్గించాలి. పండ్లూ, కూరగాయలూ ఎక్కువగా తీసుకోవడం వలన శరీరానికి పీచు అందుతుంది. ఇది అధిక కొవ్వుని శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. దాంతోపాటు విటమిన్లూ, ఖనిజాలూ శరీరానికి అందుతాయి.
 
ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా తాగడం అలవాటుగా మార్చుకోవాలి. తరచూ నీళ్లు తాగడం ఇబ్బంది అనుకునేవారు లెమన్ టీ‌లో చక్కెర తక్కువగా వేసుకుని తాగాలి. సన్నగా మారేందుకు వేళకు నిద్రపోవడం కూడా అవసరమే. అందుచేత ఎన్ని పనులున్నప్పటికీ కనీసం 7-8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu