సోంపు పొడితో శరీరంలోని కొవ్వును అదుపులో ఉంచుంది. ముఖ్యంగా.. సోంపును తీసుకోవడం వల్ల ఆస్తమా, దగ్గుకు మంచి ఉపశమనం కలుగుతుంది.
సోంపును బెల్లంతో కలిపి తీసుకుంటే నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. అలాగే, కఫాన్ని నివారించే గుణం ఇందులో ఉంది.
భోజనం తర్వాత ప్రతి రోజు కనీసం పది గ్రాముల సోంపును తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతో శ్వాసక్రియ చాలా బాగుంటుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
కాళ్లు, చేతుల్లో మంటగా ఉంటే సోంపు పొడి, చక్కెర సమపాళ్ళలో తీసుకుంటే మంట తగ్గి ఉపశమనం కలుగుతుంది. సోంపు చిన్న పిల్లలకు ఇవ్వడం వలన వారి కడుపు శుభ్రమవ్వడమే కాకుండా కడుపు ఉబ్బరంగా ఉండటం కూడా తగ్గుముఖం పడుతుంది.