ఎండు ద్రాక్షలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఐరన్ కంటెంట్ అధికంగా ఉండే ఎండుద్రాక్ష మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉన్న ఎండుద్రాక్ష జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్‌ను నివారిస్తుంది.
ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించడం ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్, ఎ-కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి కండరాలు బలహీనపడకుండా కాపాడతాయి. సహజ చక్కెర స్థాయిలు ఇందులో పుష్కలం. ఇది శరీరంలో శక్తిని ప్రసారం చేయడంతో పాటు బరువును నియంత్రిస్తుంది.
ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష ఆకలిని నియంత్రిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పిల్లల మెదడు పదునుగా మారుతుంది. ఎండుద్రాక్షల్లోని బోరాన్ మెదడుకు మేలు చేస్తుంది.