చాలా మందికి ఎక్కువ నిద్రపోయే అలవాటు ఉంటుంది. కానీ ఎక్కువ నిద్రపోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు పట్టుకుంటాయని చెబుతున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము.
ఇటీవలి తెలిపిన ఒక అధ్యయనం ప్రకారం, 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం ఆరోగ్యానికి సమస్యలు తెస్తుంది.
9 గంటల కంటే ఎక్కువ నిద్రించే వ్యక్తికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఎక్కువ నిద్ర శారీరక శ్రమను తగ్గిస్తుంది, ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి.
అతినిద్ర పోయేవారిలో ఊబకాయం సమస్య అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
9 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా ప్రభావితమై మలబద్ధకం సమస్య రావచ్చు.
ఎక్కువ నిద్రపోవడం వల్ల శరీరం చురుకుగా ఉండక సోమరితనం ఆవహిస్తుంది.
ఈ కారణంగా తలనొప్పి లేదా అలసట అనిపిస్తుంది.