సినిమాకెళ్లి పాప్‌కార్న్ తింటున్నారా.. ఏం జరుగుతుందో తెలుసా?
సాధారణంగా సినిమా థియేటర్‌కు వెళ్లాక విశ్రాంతి సమయంలో ప్రతి ఒక్కరూ వేడివేడిగా లభించే పాప్‌కార్న్ కొనుక్కుని ఆరగిస్తుంటారు. ఎందుకంటే వీటిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఈ ఇష్టానికి కారణం ఒకటి వాటి రుచి అయిత
సాధారణంగా సినిమా థియేటర్‌కు వెళ్లాక విశ్రాంతి సమయంలో ప్రతి ఒక్కరూ వేడివేడిగా లభించే పాప్‌కార్న్ కొనుక్కుని ఆరగిస్తుంటారు. ఎందుకంటే వీటిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఈ ఇష్టానికి కారణం ఒకటి వాటి రుచి అయితే, రెండోది వాటిల్లో దాగి వున్న ఆరోగ్య ప్రయోజనాలు. క్యాలరీలు, ఫ్యాట్ తక్కువ ఉండే వీటిని ఎంత తీసుకున్నా ప్రమాదం లేదన్నది చాలా మంది అభిప్రాయంగా ఉంది.
నిజానికి ఈ ఆలోచన తప్పు. బయట సూపర్ మార్కెట్లలో, సినిమా థియేటర్లలో లభించే పాప్‌కార్న్ తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలతో పాటు బరువు పెరిగే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బయట దొరికే పెద్ద ప్యాకెట్ పాప్‌కార్న్‌లో 1200 క్యాలరీలు, 980 మిల్లీగ్రాముల సోడియం, 60 గ్రాముల శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటాయట.
ఒక ప్యాకెట్ పాప్‌కార్న్... మూడురోజులు తీసుకునే ఆహారంతో సమానం. బరువు తగ్గించుకునే పనిలో ఉండేవారు థియేటర్‌కెళ్లి... పాప్‌కార్న్ తీసుకుంటే మరిన్ని క్యాలరీలు శరీరంలో చేరి బరువు పెరగడం తప్ప మరేప్రయోజనం ఉండదని వారు స్పష్టం చేస్తున్నారు.