Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వామ్మో ఎండలు.. మందు బాబులూ బీరొద్దు.. డీ హైడ్రేషన్ తప్పదట!

Advertiesment
beer
, గురువారం, 21 ఏప్రియల్ 2016 (15:30 IST)
అసలే ఎండలు మండిపోతున్నాయి. డీహైడ్రేషన్‌ను తగ్గించుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు పడుతుంటారు. అయితే బీర్ తాగితే వేసవిలో రిలీఫ్‌గా ఉంటుందని మందు బాబులు ఫుల్‌గా బీర్ లాగిస్తే మాత్రం డీహైడ్రేషన్‌తో తిప్పలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బీర్‌తో పాటు ఆల్కహాల్ డ్రింక్స్ ఏది తీసుకున్నా.. శరీరంలో ఉన్న నీటి శాతాన్ని తగ్గిస్తుంది. ఆల్కహాల్ తీసుకుంటే తరచూ యూరిన్ పాస్ చేయడం జరుగుతుందని తద్వారా డీ హైడ్రేషన్‌ సమస్య తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది ఎక్కువగా బీర్లు తాగుతుంటారు. అలా తాగీ తాగీ నీటిని కోల్పోవడం చాలా ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవైపు ఎండలతో చెమట రూపంలో నీరు బయటికి వచ్చేస్తుంది. ఇక బీరు తాగితే మాత్రం డీ హైడ్రేషన్ ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సో ఎండాకాలంలో బీరే కాదు.. ఆల్కహాల్ తీసుకునే ముందు ఓసారి ఆలోచించండి...!

Share this Story:

Follow Webdunia telugu