వక్కలు నమలడం వలన మెదడు మొద్దుబారుతుందని కొందరి నమ్మకం, కానీ వాస్తవం ఏంటంటే... చాలామందికి ఇప్పటికీ టిఫిన్, భోజనము చేసిన వెంటనే వక్కపొడి తినడం అలవాటు. దీనివలన జీర్ణశక్తిని, ఉత్సాహాన్ని పొందవచ్చుననేది వాస్తవం. ఐతే అదేపనిగా రోజంతా తినడం వలన మెదడుపై కొంత చెడుప్రభావము వాస్తవమే.
వక్కలు లేదా వక్కపొడి తినడం వలన దంతాలు నల్లబడతాయని అంటారు. ఐతే ఇది కేవలం అపోహ మాత్రమే. దంత సంరక్షణ సరిగా ఉంటే పళ్ళ ఆరోగ్యానికి హానిలేదు. సున్నము, తమలపాకు, వక్కలతో కలిపి తింటే ఒక రకమైన రంగు పళ్ళకు వచ్చి చేరుతుంది.
వక్కపొడి వలన క్యాన్సర్ వస్తుందని కొందరు అంటుంటారు. కానీ వాస్తవం ఏంటంటే వక్కపొడి వలన క్యాన్సర్లు వచ్చినట్లు ఎక్కడా దాఖలాలు లేవు. క్యాన్సర్ రావడానికి అనేక కారణాలలో ఇది ఒకటి మాత్రమే.