ఉడకబెట్టిన కోడిగుడ్లు. ఇవి రుచికరమైనవి మాత్రమే కాదు ఏ వయసులోనైనా మీ ఆరోగ్యానికి మంచివి. పాలతో పాటు, గుడ్లు ప్రోటీన్ కోసం అత్యధిక జీవ విలువ కలిగి ఉంటాయి. ఉడకబెట్టిన కోడిగుడ్లు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఉడకబెట్టిన కోడిగుడ్లలో ఎక్కువ కేలరీలు వుండవు కనుక బరువు తగ్గాలనుకుంటే ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.
ఉడికించిన గుడ్డులోని తెల్లసొన ఆరోగ్యకరమైనది, కనుక లోపలి పసుపు పదార్థం పక్కనబెట్టేసి తెల్లసొన తింటే కొలెస్ట్రాల్ చేరదు. కోడిగుడ్లలోని కోలిన్ కంటెంట్ ద్వారా మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఉడకబెట్టిన గుడ్లలో ఉండే లుటిన్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.
ఉడికించిన గుడ్లలో ప్రోటీన్, కోలిన్ వంటి ఆరోగ్యకరమైన మూలకాల కలయిక మెదడును ఉత్తేజపరిచేందుకు సహాయపడుతుంది. ఆరోగ్యవంతులు వారానికి ఏడు గుడ్లు వరకూ తినవచ్చు. అనారోగ్యవంతులు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.