Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పేపర్ కప్పులో టీ తాగితే క్యాన్సర్ ఖాయం..

పేపర్ కప్పులో టీ తాగితే క్యాన్సర్ ఖాయం..
, సోమవారం, 9 నవంబరు 2020 (11:01 IST)
Paper Cups
పేపర్ కప్పులో టీ తాగితే క్యాన్సర్ ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పేపర్​ కప్పుల్లో టీ తాగితే అనారోగ్యం తప్పదంటున్నాయి అధ్యయనాలు. ప్లాస్టిక్‌ కప్పుల్లో టీ తాగితే హానికరమని తెలిసిందే. అయితే వాటికి ప్రత్యామ్నాయంగా ఒకసారి వాడిపారేసే (డిస్పోజబుల్‌) పేపర్‌ కప్పుల్ని విరివిగా వినియోగిస్తున్నాం ఇప్పుడు. అయితే ఇప్పుడు వచ్చిన సమస్యల్లా కూడా అదే.. ఈ పేపర్‌ కప్పుల్లో టీ తాగినా హానికరమేనని ఖరగ్‌పుర్‌ ఐఐటీ అధ్యయనంలో తేలింది. 
 
పేపర్‌ కప్పుల్లో వేడి ద్రవం పోసినప్పుడు ఆ పేపర్‌లోని మైక్రోప్లాస్టిక్‌ కణాలు, ఇతర ప్రమాదకర రేణువులు ద్రవంలో కలిసిపోతున్నాయని అధ్యయనం తేల్చింది. సాధారణంగా పేపర్ కప్పులు హైడ్రోఫోబిక్‌ ఫిల్మ్‌ సన్నటి పొరతో తయారు చేస్తారు. కాగా ఇందులోనూ పాలీ ఇథలీన్‌ అంటే ప్లాస్టిక్‌ ఉంటుంది. వేడి ద్రవం పోసిన 15 నిమిషాల్లోపే ఈ మైక్రోప్లాస్టిక్‌ లేయర్‌లో చర్య జరుగుతుంది' అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సుధా గోయెల్‌ చెప్పారు. 
 
85-90 డిగ్రీల సెల్సియస్‌ వేడి ఉండే 100 ఎంఎల్‌ వేడి ద్రవంలోకి పేపర్‌ కప్పు నుంచి 25 వేల మైక్రోప్లాస్టిక్‌ రేణువులు విడుదలవుతాయని అధ్యయనంలో తేలింది. ఈ రేణువుల్లో అయాన్లతో పాటు క్రోమియం, కాడ్మియం వంటి విషపూరిత భారీ లోహాలు ఉంటాయని ఆమె వివరించారు. వీటి వల్ల అనేక రకాలైన క్యాన్సర్లు వస్తాయంటూ చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇవి మహిళలు ఆచరించదగ్గ ఆరోగ్య నియమాలు...