Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిప్రెషన్‌కు చెక్ పెట్టాలా? వాకింగ్ సూపర్ మందు.. గుడ్లు, ఆకుకూరలు తీసుకోండి.

ప్రపంచవ్యాప్తంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాము డిప్రెషన్‌లో ఉన్నామనే నిజాన్ని గుర్తిస్తే, డిప్రెషన్‌ను అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. ఆ వెనువెంటనే, దాన్ని అధిగ

Advertiesment
Depression health tips and foods
, గురువారం, 18 ఆగస్టు 2016 (11:49 IST)
ప్రపంచవ్యాప్తంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాము డిప్రెషన్‌లో ఉన్నామనే నిజాన్ని గుర్తిస్తే, డిప్రెషన్‌ను అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. ఆ వెనువెంటనే, దాన్ని అధిగమించగలిగే శక్తులు మనలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ తర్వాత క్రమానుగతంగా దాన్నించి బయటపడే ప్రయత్నాలు చేయాలి. డిప్రెషన్‌ నుంచి బయటపడటానికి వాకింగ్‌ బాగా తోడ్పడుతుంది. వాకింగ్‌లో మనో వ్యధనుంచి విముక్తం చేసే లక్షణాలు ఉన్నాయి. 
 
వాకింగ్‌లో లభించే తాజా గాలి, శరీరాన్ని ఉత్తేజితం చేయడమే కాకుండా, మెదడుకు బాగా ఆక్సిజన్‌ అందడంతో ఆలోచనలు ఒక స్పష్టరూపం ధరిస్తాయి. ఏదైనా పెంపుడు జంతువును కూడా తోడు చేసుకోగలిగితే అది మరింత మేలు చేస్తుంది. డిప్రెషన్‌ నుంచి బయటపడేలా చేసే ఆహార పదార్థాలు కూడా ఈ విషయంలో తోడ్పడతాయి. ముఖ్యంగా అరటి పండ్లు, ముడి ధాన్యాలు, చేపలు, బ్రౌన్‌ రైస్‌, పాలకూర బాగా సహకరిస్తాయి.
 
సంకీర్ణ కార్బోహైడ్రేట్లు ఉండే ధాన్యాల్లో మెదడును చైతన్య పరిచే సెరటోనిన్‌ సమృద్ధిగా ఉంటుంది. వీటితో పాటు బి- విటమిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ అదనగా తీసుకోవడం వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. బి-విటమిన్‌ లోపిస్తే డిప్రెషన్‌ మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది అందువల్ల బి- విటమిన్‌ లభించే గుడ్లు, ఆకుకూరలు బాగా తీసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లాన్ని ఆహారంలో వాడండి.. బ్లెడ్ క్యాన్సర్‌కు చెక్ పెట్టండి..