దంత చిగుళ్ల సమస్యలు ఎందుకు వస్తాయి?
మానవశరీరంలో అత్యంత దృఢమైనవి దంతాలు. ఎముకల తరహాలో బలమైన పదార్థాలతో ఇవి ఏర్పడతాయి. దంతాల్లో ఎనామిల్ పొర, డెంటిన్ పొర, మెత్తటి కణజాలం అని మూడు భాగాలు ఉంటాయి. అన్నింటికన్నా పైన ఉండేది ఎనామిల్ పొర.
మానవశరీరంలో అత్యంత దృఢమైనవి దంతాలు. ఎముకల తరహాలో బలమైన పదార్థాలతో ఇవి ఏర్పడతాయి. దంతాల్లో ఎనామిల్ పొర, డెంటిన్ పొర, మెత్తటి కణజాలం అని మూడు భాగాలు ఉంటాయి. అన్నింటికన్నా పైన ఉండేది ఎనామిల్ పొర. ఇది పాక్షికంగా పారదర్శకంగా, తెలుపు రంగులో ఉంటుంది. దంతాలకు అత్యంత దృఢత్వాన్ని ఇచ్చేది ఇదే.
ఎనామిల్ పొర కింద డెంటిన్ పొర ఉంటుంది. డెంటిన్ అంటే ఎముకల వంటి కణజాలం. ఇది కూడా దృఢంగా ఉంటుంది. లేత పసుపు రంగులో ఉంటుంది. ఈ రెండింటికన్నా లోపల సున్నితమైన కణజాలం ఉంటుంది. దీనినే పల్ప్‌గా కూడా పేర్కొంటారు. దంతాలను, చిగుళ్లను కలిపి ఉంచేందుకు ఇది తోడ్పడుతుంది. ఇందులో రక్త నాళాలు, నాడులు ఉంటాయి. దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి, పెరగడానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలను రక్త నాళాలు సరఫరా చేస్తుంటాయి.
అయితే, దంతాలను సరిగా శుభ్రం చేయక పోయినా.. చిగుళ్ళ చిక్కుకున్న ఆహారాన్ని తొలగించకపోయినా కుళ్ళిపోయి దుర్వాసన రావడమే కాకుండా ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల చిగుళ్ల వాపు, నొప్పి వంటివి వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ శరీరంలోని రోగనిరోధక శక్తి ప్లాక్ బ్యాక్టీరియాను చంపేస్తాయి. కానీ కొన్నిసార్లు బ్యాక్టీరియాకు బదులుగా చిగుళ్ల కణాలపైనా దాడి చేస్తుంది. దీనివల్ల చిగుళ్ల వ్యాధి వస్తుంది.
ఏదైనా ఆహారం ఆరగించినపుడు కాస్త గట్టిగా, పదునుగా ఉన్న ఆహారం గుచ్చుకుంటే చిగుళ్లకు గాయాలవుతాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది. చిగుళ్ల వాపు వచ్చినప్పుడు అవి దంతాలను బలంగా పట్టి ఉంచలేకపోతాయి. అలాంటప్పుడు ఏదైనా నమిలితే దంతాలు కదిలి నొప్పి పుడుతుంది. ఇలాంటివారు దంత నిపుణులను సంప్రదించి తగిన వైద్యం చేయించుకుంటే సరిపోతుంది.