ప్రతి రోజు శరీరానికి నూనెతో మాలిష్ చేస్తుంటే వృద్ధాప్యపు ఛాయలు కనపడవు. దీంతోపాటు శరీరంలోనున్న అలసట, పైత్యం తొలగి శరీరానికి ఉపశమనం కలుగుతుంది. మాలిష్ చేస్తుంటే చర్మం కాంతివంతంగా, ముడతలు లేనిదిగా తయారవుతుంది.
యవ్వన దశలో శరీర చర్మం స్వాభావికంగా అందంగా, నిగారింపును సంతరించుకునివుంటుంది. ఇదే వయసులో మొటిమల సమస్యలు కూడా విపరీతంగానే ఉటుంది. కాబట్టి చర్మానికి నూనెతో మాలిష్ చేయడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
నూనె పూయడంతో కుండ, చర్మం, ఇరుసు, కర్ర తదితర పదార్థాలు మెరుగ్గా తయారై తమ పనితనంలో మంచి పట్టును సాధిస్తాయో అలాగే శరీరానికి నూనెతో మాలిష్ చేస్తే శరీర చర్మం అందంగా నిగారింపును సంతరించుకుంటుంది.