Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొబ్బరిలో కొలెస్ట్రాల్ లేదండోయ్.. కొబ్బరి తింటే గుండె జబ్బులు రావండోయ్...

కొబ్బరి అంటే కొలెస్ట్రాల్ అని మానేస్తున్నారా? అయితే పప్పులే కాలేసినట్లే. కొబ్బరి మేధోశక్తిని పెంచుతుంది. తెలివితేటలను పెంచుతుంది. అందుకే టెంకాయను ఆలయాల్లో ప్రసాదం రూపంలో ఇస్తుంటారు. పెళ్లి చేసేటపుడు ట

Advertiesment
coconut health benefits
, ఆదివారం, 14 ఆగస్టు 2016 (12:35 IST)
కొబ్బరి అంటే కొలెస్ట్రాల్ అని మానేస్తున్నారా? అయితే పప్పులే కాలేసినట్లే. కొబ్బరి మేధోశక్తిని పెంచుతుంది. తెలివితేటలను పెంచుతుంది. అందుకే టెంకాయను ఆలయాల్లో ప్రసాదం రూపంలో ఇస్తుంటారు. పెళ్లి చేసేటపుడు టెంకాయ చేతికి పెట్టి పంపిస్తారు. ఇతర రాష్ట్ర ప్రజలతో పోలిస్తే కొబ్బరి బాగా తినే కేరళ వారికే మేధాశక్తి ఎక్కువగా ఉండడం అందరికీ తెలిసిందే. 
 
కొబ్బరిలో కొలెస్ట్రాల్‌ పదార్థాలుండవు. కొబ్బరి తింటే గుండె జబ్బులు వస్తాయన్నది అపోహ. లెక్క ప్రకారం ఇండియాలో బాగా కొబ్బరి తినే కేరళ రాష్ట్ర ప్రజలకు ఎక్కువ గుండె జబ్బులుండాలి. కానీ భారత్‌లో కేరళ రాష్ట్రమే అతి తక్కువ మంది గుండె రోగులున్నట్లు పరిశోధకులు నిరూపించారు. కొబ్బరిలో అలాంటివి ఎన్నో మంచి గుణాలున్నాయి. 
 
నములుతుంటే బాగా పిప్పి వచ్చే కొబ్బరి కాకుండా, పాలు వచ్చే కొబ్బరిని రోజుకు ఒక కాయ చొప్పున ప్రతి మనిషీ తింటే ఎంతో మంచిది. తిరుగులేని బలం. పోషక పదార్థాల గని పచ్చికొబ్బరి. ప్రతిరోజు విడిగా తినడం కుదరని వారు కూరల్లో పొయ్యి మీద నుంచి దించే ముందు చల్లుకొని తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మందార ఆకుతో చేసిన టీని తాగితే రక్తపోటు మటాష్..