Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒత్తిడి ప్లస్ కంగారు పడుతున్నారా? రెండంటే రెండే రేగి పండ్లు తినిచూడండి..

రేగి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎప్పుడైనా ఒత్తిడి, కంగారుగా అనిపించినప్పుడు రెండంటే రెండు రేగి పండ్లు తింటే ఎంతో ఫలితం ఉంటుంది. రేగి పండ్లలో వత్తిడి తగ్గించే గుణాలున్నాయి. రేగి పండ్లలో విట

ఒత్తిడి ప్లస్ కంగారు పడుతున్నారా? రెండంటే రెండే రేగి పండ్లు తినిచూడండి..
, గురువారం, 22 డిశెంబరు 2016 (14:07 IST)
రేగి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎప్పుడైనా ఒత్తిడి, కంగారుగా అనిపించినప్పుడు రెండంటే రెండు రేగి పండ్లు తింటే ఎంతో ఫలితం ఉంటుంది. రేగి పండ్లలో వత్తిడి తగ్గించే గుణాలున్నాయి. రేగి పండ్లలో విటమిన్-సి, ఏ పొటాషియం అధికం. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఈ పండ్లు కాలేయానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మానికి చాలా మేలు చేస్తాయి. వృద్దాప్యా ఛాయల్ని దూరం చేస్తాయి. సీజన్ అయిపోయే వరకు రోజూ ఈ పండును తీసుకుంటే చాలా మంచిది. కాల్షియం, పాస్పరస్, పుష్కలంగా దొరికే ఈ రేగి పళ్ళు తినడంతో ఎముకులు, దంతాలు బలపడతాయి. పుల్లని , తియ్యని రుచిలో వుండే ఈ రేగు పళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
 
ఈ పండ్లు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు సమస్యలు బాధించవు. ఈ పండ్లలో లభించే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికళ్లను బయటకు పంపేస్తాయి. రేగిపండు తొక్కు కాలేయానికి చాలామంచిది. క్యాన్సర్‌ కారకాలను దూరంగా ఉంచుతుంది. ఇవి చర్మానికీ మేలుచేస్తాయి. వృద్ధాప్యఛాయలు దూరమవుతాయి. వీటిల్లో కెలొరీలు చాలా స్వల్పం. బరువు పెరుగుతామనే భయం కూడా ఉండదు. శరీరానికి తక్షణ శక్తి అంది అలసట ఉన్నా పోతుంది. కాబట్టి రోజూ  తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నట్స్‌ను రోజూ ఇంతే తీసుకోవాలి.. 12 వేరుశెనగ పప్పులకు మించకూడదు..