బీపీకి దివ్యౌషధం చెర్రీ జ్యూస్.. రోజూ తాగండి.. బీపీకి చెక్ పెట్టండి
చెర్రీ పండ్ల రసం రక్తపోటును నియంత్రిస్తుంది. బీపీకి మంచి మందు. చెర్రి జ్యూసును రోజూ తాగడం ద్వారా బీపీ మాత్రలను మానేయవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ వైద్యుల సలహా మేరకే దీన్ని చేయాల్సి వుంటుంద
చెర్రీ పండ్ల రసం రక్తపోటును నియంత్రిస్తుంది. బీపీకి మంచి మందు. చెర్రి జ్యూసును రోజూ తాగడం ద్వారా బీపీ మాత్రలను మానేయవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ వైద్యుల సలహా మేరకే దీన్ని చేయాల్సి వుంటుందని నార్తంబ్రియా యూనివర్సిటీ చేసిన నిర్వహించిన ఓ స్టడీలో వెల్లడైంది. బిపి లక్షణాలు ప్రాథమిక దశలో ఉన్న వారికి ఈ జ్యూసు ఇవ్వడం వల్ల ఏడు శాతం తగ్గుదల కనిపించిందట.
బిపిని తగ్గించేందుకు వాడే మందుల ముందు చెర్రీ జ్యూసు ఏమాత్రం తీసిపోదట. ప్రాథమిక దశలో ఉన్న బీపీని చెర్రీ జ్యూస్ పూర్తిగా నయం చేస్తుందట. అంతేగాకుండా షుగర్ ద్వారా ఏర్పడే కార్డియోవాస్క్యులర్ జబ్బులు కూడా చెర్రీ జ్యూస్ సేవనంతో దూరమవుతాయట. అధికరక్తపోటును క్రమబద్ధీకరించడంలో చెర్రీ జ్యూసు కీలకంగా వ్యవహరిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. చెర్రీ పళ్ల జ్యూసు తీసుకోవడం వల్ల వాస్క్యులర్ ఫంక్షన్ కూడా బాగుంటుందట.
చెర్రీ పళ్ల జ్యూసు తీసుకున్న వారిలో రక్తపోటు రేటు బాగా తగ్గిందని ఆ స్టడీలో వెల్లడి అయ్యింది. రక్తపోటు తగ్గడానికి చెర్రీ పండులో ఉండే ఫెనొలిక్ యాసిడ్స్, ప్రొటోకాట్‌చుక్, వానిలిక్‌లు కారణమంటున్నారు శాస్త్రవేత్తలు.