Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారా? ఒక్కసారి ఆలోచించండి

Advertiesment
French Fries
, గురువారం, 7 ఏప్రియల్ 2016 (09:44 IST)
ఫ్రెంచ్ ఫ్రైస్ లొట్టలేసుకుని తింటున్నారా.. అయితే కేన్సర్ ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఫ్రైంచ్ ఫ్రైస్‌ను హైడ్రోజెనేటెడ్ నూనెలతో అధిక ఉష్ణోగ్రత వద్ద తయారుచేయడం వల్ల, అవి కొవ్వు, ట్రాన్స్ కొవ్వు ధమనులను పాడుచేస్తాయి. ఇది ప్రధాన కేన్సర్ కారకమైన ఆహారం. ఉప్పుతో చేసిన లేదా మౌల్డ్ చేసిన వేరుశెనగ తింటే, అది కాలేయం కేన్సర్ ప్రమాదాన్ని పెంచే అఫ్లాటాక్సిన్స్ అని ఫంగస్ కలిగి ఉంది.
 
కేన్సర్‌కు కారణం అయ్యే ఒక ప్రధానమైన ఆహారాల్లో ఈ హైడ్రోజనేటడ్ ఆయిల్ కూడా ఒకటి. ఈ నూనెలను, తినే ఆహారాలు నిల్వచేయడానికి తయారు చేసే ఆహారాల తయారీ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఇటువంటి నూనెలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఇంట్లో కూడా వేపుళ్లకు వాడిన నూనెను (కాచిన నూనెను) ఎక్కువసార్లు ఉపయోగించడం సరికాదు. 
 
అలాగే కూల్ డ్రింక్స్, సోడాలో పంచదార, ఫుడ్ కెమికల్స్, కలర్స్ కలిసి వుంటాయి. సోడా శరీరంలో గ్యాస్ ఉత్పత్తికి కారణం అవుతుంది. కేన్సర్‌కు కారణమవుతాయి. ఇకపోతే ఆపిల్స్, ద్రాక్ష వంటి ఆరోగ్యకరమైన పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మేలు అని, వీటిని చాలా మంది రెగ్యులర్‌గా తీసుకునే పండ్లే క్యాన్సర్‌కు కారణమవుతాయి. రసాయనికంగా పండించిన పండ్లు క్యాన్సర్‌కు దారితీస్తుంది. కాబట్టి, సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లకు ఎక్కువ ప్రాధన్యత ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu