చక్కెర వ్యాధిగ్రస్తులు మామిడిపండు తినవచ్చా?
వేసవికాలంలో లభ్యమయ్యే పండ్లలో మామిడి పండు ఒకటి. ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండు. ఈ సమ్మర్ సీజన్ ఫ్రూట్‌ను ఈ పండును కంటితో చూసినా.. మామిడి పండు వాసన ముక్కుపుటాలను చేరినా తినకుండా ఉండటం కష్టతరం. అయితే, ఇంతటి
వేసవికాలంలో లభ్యమయ్యే పండ్లలో మామిడి పండు ఒకటి. ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండు. ఈ సమ్మర్ సీజన్ ఫ్రూట్‌ను ఈ పండును కంటితో చూసినా.. మామిడి పండు వాసన ముక్కుపుటాలను చేరినా తినకుండా ఉండటం కష్టతరం. అయితే, ఇంతటి మధురమైన పండును తినే విషయంలో చక్కెర వ్యాధితో బాధపడేవారు తినకూడదని చెపుతుంటారు. ఎందుకంటే ఎంతో మధురంగా, తియ్యగా ఉండే ఈ పండును డయాబెటిక్ రోగులు ఆరగించడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అయితే, కొంతమంది వైద్య నిపుణులు మాత్రం మామిడి పండును ఆరగించవచ్చని చెపుతున్నారు.
ఎందుకంటే మామిడి పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఒక మామిడి పండులో ఉన్న కేలరీలు ఒకటిన్నర రోటీలో ఉండే కేలరీలతో సమానం. ఒక మామిడి పండు తిన్నంత మాత్రాన రక్తంలో గ్లూకోజ్ పెద్దగా పెరిగిపోదు. కాకపోతే అన్నం తిన్న వెంటనే లేదా, అన్నంతోపాటు మామిడి పండు తినకూడదు.
సాయంత్రం వేళల్లో చిరుతిండ్లకు బదులు మామిడి పండును సగం మేరతీసుకోవచ్చు. దానివల్ల తగినంత శక్తి లభిస్తుంది. పైగా తీసుకుంటున్నది కొద్ది పరిమాణంలోనే కాబట్టి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ కూడా పెరగవు. కనుక రోజులో నాలుగు గంటల విరామంతో మూడు పర్యాయాలు మామిడి పండును, ప్రతిసారి సగానికి మించకుండా తీసుకోవచ్చని కొందరు వైద్యులు చెపుతున్నారు.