Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30 ఏళ్లు దాటాక.. ఎముకలు బలంగా ఉండాలంటే.. ఏం చేయాలో తెలుసా?

ఎముకలు బలంగా ఉండాలంటే.. 30 దాటిన మహిళలు తప్పకుండా క్యాల్షియం తీసుకోవాలి. 19 నుంచి 50 సంవత్సరాల మహిళలకు రోజుకి 1000 మి.గ్రా, 51-70 ఆ పైవయసులో ఉన్న మహిళలకు 1200 మి.గ్రా కాల్షియం అవసరమవుతుంది. కానీ ఈ కాల

Advertiesment
Calcium and Bone Health: Eating to Protect Your Bones
, సోమవారం, 10 అక్టోబరు 2016 (13:30 IST)
ఎముకలు బలంగా ఉండాలంటే.. 30 దాటిన మహిళలు తప్పకుండా క్యాల్షియం తీసుకోవాలి. 19 నుంచి 50 సంవత్సరాల మహిళలకు రోజుకి 1000 మి.గ్రా, 51-70 ఆ పైవయసులో ఉన్న మహిళలకు 1200 మి.గ్రా కాల్షియం అవసరమవుతుంది. కానీ ఈ కాల్షియం ఆహారం ద్వారా పొందే ప్రయత్నం చేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
 
క్యాల్షియం కోసం సప్లిమెంట్లను వాడకూడదు. కాల్షియం సప్లిమెంట్లను వాడేవాళ్లు ఇతరత్రా ఆరోగ్య ఇబ్బందులకు కూడా గురికాక తప్పదని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవసరానికి మించి కాల్షియం శరీరంలో చేరటం వల్ల కిడ్నీలో రాళ్లు, మిల్క్‌ ఆల్కలై సిండ్రోమ్‌లాంటి రుగ్మతలతోపాటు శరీరం ఐరన్‌ను పీల్చుకునే స్వభావాన్ని కుంటుపరుస్తుంది. అలాగే ఇతరత్రా వ్యాధులకు వాడే మందుల మీద కూడా ప్రభావం పడుతుంది.
 
అయితే క్యాల్షియంతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముఖ్యంగా మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళలు ఎముకల నొప్పులు, నీరసం లక్షణాలు కనిపిస్తే రోజూ రెండు పూటలా పాలు తీసుకోవాలి. అలాగే వారానికి మూడు సార్లు పనీర్, పాల ఉత్పత్తులు వంటివి డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆకుకూరలు వారానికి మూడుసార్లు తీసుకోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హనమంత వాహనంపై శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీరాముడిగా...(Video)