Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#WorldBloodDonorDay : రక్తదానం వల్ల రక్తదాతకు కలిగే లాభమేంటి?

డబ్బుదానం చేయవచ్చు.. అన్నదానం చేయవచ్చుకానీ.. అన్ని దానాల కంటే ముఖ్యమైనది రక్తదానం. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ మనిషిని బతికిస్తుంది రక్తం. జూన్‌ 14వ తేదీ ప్రపంచ రక్తదాన దినోత్సవం. ఈ సందర్భంగ

Advertiesment
#WorldBloodDonorDay : రక్తదానం వల్ల రక్తదాతకు కలిగే లాభమేంటి?
, గురువారం, 14 జూన్ 2018 (12:30 IST)
డబ్బుదానం చేయవచ్చు.. అన్నదానం చేయవచ్చుకానీ.. అన్ని దానాల కంటే ముఖ్యమైనది రక్తదానం. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ మనిషిని బతికిస్తుంది రక్తం. జూన్‌ 14వ తేదీ ప్రపంచ రక్తదాన దినోత్సవం. ఈ సందర్భంగా రక్తందానం చేయడం వల్ల రక్తదాతకు కలిగే లాభాలేంటో పరిశీలిద్ధాం.
 
* రక్తం అవసరమైనవారికే కాదు దానిని దానం చేసే దాతలకూ ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
* రక్తదాతలకు సాటి మనుషుల ప్రాణాలు కాపాడే అవకాశం లభిస్తుంది. ఇది సాటిలేని సంతృప్తిని ఇస్తుంది.
* రక్తదానం చేసేవారిలో గుండెకు సంబంధించిన రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. తరచూ రక్తదానం చేయడం వల్ల శరీరంలో ఉత్పత్తయ్యే ఐరన్ శాతం పూర్తి నియంత్రణలో ఉండటమే దీనికి కారణం.
* రక్తదానం క్యాన్సర్‌ బారిన పడే అవకాశాల్ని దాదాపుగా తగ్గిస్తుంది.
* రక్తదానం చేసేవారికి తమ శరీరానికి సంబంధించిన అనేక రకాలైన రక్త పరీక్షలను పూర్తిగా, ఉచితంగా చేసుకునే అవకాశం దొరుకుతుంది. దీనివల్ల రక్తదానం చేసేవారు తమకు తాము ఆరోగ్యవంతులుగా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకునే సదుపాయం ఉంది.
* రక్తదానం చేయడం వల్ల శరీరంలోని కేలరీలు ఖర్చు అవుతాయి. దీంతో బరువు పెరిగే ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.
* కొవ్వు తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండి, శరీరం ఫిట్‌గా ఉంటుంది.
* ఎర్ర రక్తకణాల్లో చెడు, మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడానికి రక్తదానం చాలా ఉపయోగకరం.
* శరీరంలో ఐరన్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. రక్తంలో ఎక్కువగా ఐరన్‌ ఉంటే గుండెకు హాని చేస్తుంది.
* కార్డియో వాస్కులర్‌ వ్యాధులను నివారించేందుకు రక్తదానం ఉపకరిస్తుంది.
* మహిళల్లో వయస్సు పెరిగిన తర్వాత రుతుస్రావం పూర్తిగా నిలిచిపోయినప్పుడు (మెనోపాజ్‌ సమయంలో) వారి శరీరంలో నిల్వ ఉండే ఐరన్‌ స్థాయిని సమతుల్యం చేసుకోవడానికి రక్తదానం చేయడం చాలా మేలు కలిగిస్తుంది. 
* రక్తదానం చేయడం వల్లే సన్నబడిపోతారు, నీరసంగా మారుతారు, ఇతర అనారోగ్య సమస్యలకు లోనవుతారనే అపోహలు, సందేహాలు పెట్టుకోవద్దు. సో.. ఇకపై ప్రతి ఒక్కరూ వీలుచిక్కినపుడల్లా రక్తదానం చేద్ధాం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్లాక్ హెడ్స్‌ తొలగిపోవాలంటే.. ఉప్పు, టూత్‌పేస్ట్ తీసుకుని?