ఇప్పుడు అనేక రకాల ఫ్లేవర్‌లలో మనకు టీ అందుబాటులో ఉంది. ఇందులో లెమన్‌గ్రాస్ టీ ఒకటి. మన దేశంతోపాటు పలు ఆసియా దేశాల్లోనూ లెమన్ గ్రాస్ మొక్క బాగా పెరుగుతుంది. లెమన్‌గ్రాస్ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ ఆకులు అనేక రోగాలకు ఔషధంగా పనిచేస్తాయి.
లెమన్‌గ్రాస్ ఆకుల ద్వారా తయారుచేసే టీని రోజూ త్రాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ టీ తాగడం వల్ల దగ్గు, జలుబు, జ్వరంతో పాటు తలనొప్పి, కండరాల నొప్పులు, కడుపు నొప్పి తగ్గుతాయి.
అంతేకాకుండా రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుంది. పలు రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. ఇంకా కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.