ద్రాక్షరసాన్ని పంచదార కలపకుండా తీసుకోండి.. తలనొప్పికి చెక్ పెట్టండి
ద్రాక్ష పండ్ల రసంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలున్నాయి. రోజూ ఓ గ్లాసుడు ద్రాక్ష రసాన్ని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇందులోని విటమిన్ సి.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంద
ద్రాక్ష పండ్ల రసంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలున్నాయి. రోజూ ఓ గ్లాసుడు ద్రాక్ష రసాన్ని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇందులోని విటమిన్ సి.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. నలుపు ద్రాక్ష వ్యాధినిరోధక వ్యవస్థకు బలం చేకూర్చుతుంది. గుండెపోటు సమస్యలు దరిచేరవు.
ద్రాక్ష రసాన్ని సేవించడం ద్వారా శరీరంలోని మెటబాలిజం శాతాన్ని పెంపొందింపజేసినట్లవుతుంది. ఇంకా ఎరుపు ద్రాక్షలతో తయారయ్యే ద్రాక్ష రసాన్ని తీసుకుంటే మెటబాలిజం అధికరెట్లు పెరుగుతుంది. ద్రాక్ష రసం హైబీపీని నియంత్రిస్తుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్స్, యాంటీ-యాక్సిడెంట్లే ఇందుకు కారణం. ద్రాక్ష పండుకు గుండె కండరాలను రిలాక్స్ చేసి, రక్తప్రసరణను మెరుగుపరిచి.. రక్తపోటును నియంత్రించే గుణం ఉంది.
ద్రాక్ష రసం బరువు తగ్గించకపోయినా.. వ్యాయామానికి అనంతరం గ్లాసుడు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తద్వారా మెటబాలిజం స్థాయి పెరగడం.. కొవ్వు, కెలోరీలు కరిగిపోతాయని.. దీంతో బరువు తగ్గుతారు. ద్రాక్ష రసాన్ని పంచదార చేర్చకుండా తీసుకుంటే తలనొప్పిని మటుమాయం చేసుకోవచ్చు. ఇంకా ద్రాక్ష రసం రక్తంలోని టాక్సిన్‌లను వెలివేస్తుంది. రక్త ప్రసరణను మెరుగు పరిచి ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.